నీ కృపాతిశయము
Nee Krupaathishayamu
నీ కృపాతిశయమును అనునిత్యము (2)
Nee Krupaathishayamunu Anunithyamu (2)
నే కీర్తించెద తరతరములకు
Ne Keerthincheda Tharatharamulaku
నీ విశ్వాస్యతను నే ప్రచురింతును (2)
Nee Vishwaasyathanu Ne Prachurinthunu (2)
నీ కృప.. నీ కృప.. ఆకాశము కంటె హెచ్చైనది (2)
Nee Krupa.. Nee Krupa.. Aakaashamu Kante Hechchainadi (2)
మౌనిగా ఎటులుండెద - సాక్షిగా ప్రచురించక
Mounigaa Etulundeda - Saakshigaa Prachurinchaka
నా తుది శ్వాస వరకు - నీ చెంత చేరే వరకు (2)
Naa Thudi Shwaasa Varaku - Nee Chentha Chere Varaku (2)
ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృప
Inkaa Brathiki Unnaamante Kevalamu Nee Krupa
ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృప
Inkaa Sevalo Unnaamante Kevalamu Nee Krupa
ఏ మంచితనము లేకున్ననూ (2)
Ye Manchithanamu Lekunnanu (2)
కొనసాగించినది నీ కృప
Konasaaginchinadi Nee Krupa
నిలబెట్టుకున్నది నీ కృప ||నీ కృప||
Nilabettukunnadi Nee Krupa ||Nee Krupa||
పది తరములుగా వెంటాడిన మోయాబు శాపము
Padi Tharamulugaa Ventaadina Moyaabu Shaapamu
నీ కృపను శరణు వేడగా మార్చెనే వేయి తరముల్
Nee Krupanu Sharanu Vedagaa Maarchene Veyi Tharamul
అన్యురాలైన ఆ రూతును ధన్యురాలుగా మార్చినది
Anyuraalaina Aa Roothunu Dhanyuraalugaa Maarchinadi
నీ కృపయే నను దీవించగా
Nee Krupaye Nanu Deevinchagaa
ఏ శాపము నాపై పనిచేయదు ||నీ కృప||
Ye Shaapamu Naapai Panicheyadu ||Nee Krupa||
ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృప
Aarogyam Udyogam Unnaayante Kevalamu Nee Krupa
మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృప
Methuku Brathuku Unnaayante Kevalamu Nee Krupa
కృపతోనే రక్షణ ఇచ్చావు నా క్రియల వలన కానే కాదు
Krupathone Rakshana Ichchaavu Naa Kriyala Valana Kaane Kaadu
జీవితమంతా రుణస్తుడను
Jeevithamanthaa Runasthudanu
నీ యందే నిత్యము అతిశయము ||నీ కృప||
Nee Yande Nithyamu Athishayamu ||Nee Krupa||
ఇల్లు వాహనమున్నాయంటే నీదు కృపాదానమే
Illu Vaahanamunnaayante Needu Krupaadaaname
బలము ధనము ఉన్న అంటే నీదు కృపాదానమే
Balamu Dhanamu Unna Ante Needu Krupaadaaname
ఏ అర్హత నాలో లేకున్ననూ కృపా భిక్షయే నా యెడల
Ye Arhatha Naalo Lekunnanu Krupaa Bhikshaye Naa Yedala
జీవితమంతా కృతజ్ఞుడను
Jeevithamanthaa Kruthagnudanu
జీవితమంతా పాడెదను ||నీ కృప||
Jeevithamanthaa Paadedanu ||Nee Krupa||
ప్రియులే నన్ను విడనాడినా శోకమే నా లోకమా
Priyule Nannu Vidanaadinaa Shokame Naa Lokamaa
అనాథగానే మిగిలానే నా కథ ముగిసినదే
Anaathagaane Migilaane Naa Katha Mugisinade
నీ కుడి చేతిలో ఉంచగనే బెన్యామిను వంతుగా మారె
Nee Kudi Chethilo Unchagane Benyaaminu Vanthugaa Maare
ఐదంతలాయె నా భాగ్యము
Aidanthalaaye Naa Bhaagyamu
విధిరాతనే మార్చె నీ కృప ||నీ కృప||
Vidhiraathane Maarche Nee Krupa ||Nee Krupa||