నీ చిత్తంబేను

Nee Chiththambenu

Telugu by ఎ. ఎ. పొల్లార్ • andhra-kraisthava-keerthanalu

1. నీ చిత్తం బేను - నీ చిత్తంబే

1. Nee Chiththan Benu - Nee Chiththambe

నేను మట్టిని - ఓ కుమ్మరీ!

Nenu Mattini - O Kummaree!

నీ కోర్కెదీర - నన్‌ దీర్చుమా

Nee Korkedeera - Nan Deerchumaa

నీకు లొంగెదన్‌ - ఓ ప్రభువా ||

Neeku Longgedan - O Prabhuvaa ||

2. నీ మార్గంబేను - నీ మార్గంబే

2. Nee Maargambenu - Nee Maargambe

నేడు నన్ను ప-రిశోధించు

Nedu Nannu Pa-Rishodhinchu

శుద్ధిజేయుమో - యేసూ నన్ను

Shuddhijeyumo - Yesoo Nannu

నీ సన్నిధిలో - మోకరింతున్‌ ||

Nee Sannidhilo - Mokarinthun ||

3. నీ కోర్కె యేసు - నీ కోర్కెయే

3. Nee Korke Yesu - Nee Korkeye

నే గాయంబొంది - అలసితిన్‌

Ne Gaayambondi - Alasithin

బాగుచేయు నన్‌ - ముట్టిప్రభో

Baagucheyu Nan - Muttiprabho

నీకే సమస్త - శక్తి నొప్పున్‌ ||

Neeke Samastha - Shakthi Noppun ||

4. నీ యిష్టంబేను - నీ యిష్టంబే

4. Nee Yishtambenu - Nee Yishtambe

నీ యాత్మతోడ -నన్‌ నింపుమా

Nee Yaathmathoda -Nan Nimpumaa

నాయందెల్లరు - క్రీస్తున్‌జూడన్‌

Naayandellaru - Kreesthunjoodan

నీ యాధీనంబు - నన్నుంచుకో

Nee Yaadheenambu - Nannunchuko

5. అప్పుడు నేను - నీ రీతిగాన్

5. Appudu Nenu - Nee Reethigaan

తప్పకజేతు - నో ప్రభువా

Thappakajethu - No Prabhuvaa

ఇప్పుడే నీదు - సేవ జేయున్‌

Ippude Needu - Seva Jeyun

అప్పగింతు నా - సమస్తంబు ||

Appaginthu Naa - Samasthambu ||

Related Telugu Christian Songs