నే బీద చిన్న
Ne Beeda Chinna
1. నే బీద చిన్న పిల్లను
1. Ne Beeda Chinna Pillanu
నా బుద్ధి స్వల్ప మయినది
Naa Buddhi Svalpa Mayinadi
నా దివ్య యేసు కొఱకు
Naa Divya Yesu Koraku
నే నేమి చేయగలను?
Ne Nemi Cheyagalanu?
2. నిత్యంబుం చిన్న పనులు
2. Nithyambun Chinna Panulu
నే చాలం జేయవచ్చును
Ne Chaalan Jeyavachchunu
నా చిన్న తప్పు లన్నియు
Naa Chinna Thappu Lanniyu
నే చక్క పెట్టవచ్చును.
Ne Chakka Pettavachchunu.
3. మనస్సునందు కోపము
3. Manassunandu Kopamu
వేమాఱు పుట్టునప్పుడు
Vemaaru Puttunappudu
నా కన్ను లెఱ్ఱం జేయక
Naa Kannu Lerram Jeyaka
నే నోర్చు కొనవచ్చును.
Ne Norchu Konavachchunu.
4. నే తిన్నగాను నడ్చుచు
4. Ne Thinnagaanu Nadchuchu
ఇల్లంత వెలింగించుచు
Illantha Velingginchuchu
నా యేసుకై యుల్లాసముం
Naa Yesukai Yullaasamun
బుట్టింపవచ్చు నెప్పుడు
Buttimpavachchu Neppudu
5. నే నెంత చిన్న పిల్లను
5. Ne Nentha Chinna Pillanu
నా కుండు చిన్న బాధకు
Naa Kundu Chinna Baadhaku
నే తాలి ప్రేమ స్తోత్రము
Ne Thaali Prema Sthothramu
లర్పించుచుండంగలను.
Larpinchuchundangalanu.