నను విడువలేదయ్యా
Nanu Viduvaledayyaa
నను విడువలేదయ్యా నేను పారిపోయినా
Nanu Viduvaledayyaa Nenu Paaripoyinaa
వెదకి నన్ను పట్టుకున్నావు
Vedaki Nannu Pattukunnaavu
నీకు దూరమైనv నిను కాదనిపోయినా
Neeku Dooramainaa Ninu Kaadanipoyinaa
వెంటాడి హత్తుకున్నావు (2)
Ventaadi Hatthukunnaavu (2)
నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా
Nee Prema Nithyamu Vembadisthoone Undayyaa
నీ కృప నను విడువక కనికరిస్తూనే ఉందయ్యా (2)
Nee Krupa Nanu Viduvaka Kanikaristhoone Undayyaa (2)
వందనాలయ్యా యేసు వందనాలయ్యా
Vandanaalayyaa Yesu Vandanaalayyaa
వందనాలయ్యా యేసు వందనాలయ్యా (2)
Vandanaalayyaa Yesu Vandanaalayyaa (2)
1. మొండి జీవితమే నాది మార్పు కోరనిది
1. Mondi Jeevithame Naadi Maarpu Koranidi
అహంకారమే నాలో అలలై పొంగుచుండెను (2)
Ahankaarame Naalo Alalai Ponguchundenu (2)
అన్ని ఉన్నాయన్నా గర్వం
Anni Unnaayannaa Garvam
నీ మధుర స్వరం వినలేకపోయింది (2)
Nee Madhura Svaram Vinalekapoyindi (2)
అకస్మాత్తుగా నా జీవితం
Akasmaatthugaa Naa Jeevitham
అంధకారంలో పడిపోయింది
Andhakaaramlo Padipoyindi
నా హృదయం ముక్కలై
Naa Hrudayam Mukkalai
చెల్లాచెదురై పోయింది (2) ||నీ ప్రేమ||
Chellaachedurai Poyindi (2) ||Nee Prema||
2. గాఢాంధకారమే నన్ను నలువైపు చుట్టుకున్నది
2. Gaadhaandhakaarame Nannu Naluvaipu Chuttukunnadi
బ్రతుకుతానన్న ఆశే లేకుండా కృంగజేసెను (2)
Brathukuthaananna Aashe Lekundaa Krungajesenu (2)
కన్నీళ్లతో మోకాళ్లపై కూర్చొని
Kanneellatho Mokaallapai Koorchoni
మొరపెట్టి ప్రార్థించుచున్నాను (2)
Morapetti Praardhinchuchunnaanu (2)
ఆ చీకటి రోజుల్లో ప్రత్యక్షమయ్యావు
Aa Cheekati Rojullo Prathyakshamayyaavu
దివ్య వెలుగులతో నను నింపావు
Divya Velugulatho Nanu Nimpaavu
నా స్థితిగతులే మార్చేసావు
Naa Sthithigathule Maarchesaavu
నూతన జీవం నాకిచ్చావు (2) ||నీ ప్రేమ||
Noothana Jeevam Naakichchaavu (2) ||Nee Prema||