నమో యేసునాధా నాధా
Namo Yesunaadhaa Naadhaa
నమో యేసునాధా - నాధా - నమో జీవనాధా
Namo Yesunaadhaa - Naadhaa - Namo Jeevanaadhaa
సమాన విరహిత సనాతనాత్మా - సమున్నతోజ్వల ప్రశాంత ధామా ||నమో||
Samaana Virahitha Sanaathanaathmaa - Samunnathojvala Prashaantha Dhaamaa ||Namo||
1. స్థావర జంగమ జగమందున నీ శక్తి స్వరూపము ప్రతిఫలింపగ
1. Sthaavara Jangama Jagamanduna Nee Shakthi Svaroopamu Prathiphalimpaga
భూవలయాకాశంబుల మించుచు - భువన పాలనము జేసెటి ప్రభువా ||నమో||
Bhoovalayaakaashambula Minchuchu - Bhuvana Paalanamu Jeseti Prabhuvaa ||Namo||
2. ధరణీ మానవ విమోచనార్థము - కరుణను జీవము లొసగిన ప్రభువా
2. Dharanee Maanava Vimochanaarthamu - Karunanu Jeevamu Losagina Prabhuvaa
పరమ కృపాభరితా మృతసారా - సదా హృదయాబ్జ విహారా ||నమో||
Parama KrupaాBharithaa Mruthasaaraa - Sadaa Hrudayaabja Vihaaraa ||Namo||
3. సుందర మలయజ గంధ ధూపముల - చందమునను మా వినుతులు గొనుమా
3. Sundara Malayaja Gandha Dhoopamula - Chandamunanu Maa Vinuthulu Gonumaa
వందే దేవ దయాసందీప - వందే శుభదానంద స్వరూపా ||నమో||
Vande Deva Dayaasandeepa - Vande Shubhadaananda Svaroopaa ||Namo||