నమ్మవద్దు నమ్మవద్దు

Nammavaddu Nammavaddu

Telugu • andhra-kraisthava-keerthanalu

ప|| నమ్మవద్దు - నమ్మవద్దు ఈ మాయలోకం - నమ్మవద్దు

Pa|| Nammavaddu - Nammavaddu Ee Maayalokan - Nammavaddu

ఇది - ఆశజూపి మోసం జేయు - ఈ మాయలోకం గనుక

Idi - Aashajoopi Mosan Jeyu - Ee Maayalokan Ganuka

1. మిమ్మునుగన్న తల్లి యేది - మిమ్మునుగన్న తండ్రియేడి

1. Mimmunuganna Thalli Yedi - Mimmunuganna Thandriyedi

నాతోడబుట్టిన తోడులు - వార్ని

Naathodabuttina Thodulu - Vaarni

కాటికి మోసిన కోటప్ప లేరి - గనుక ||నమ్మ||

Kaatiki Mosina Kotappa Leri - Ganuka ||Namma||

2. మీరు కట్టిన యిండ్లు ఏవి మీరు - కట్టిన కోటలు

2. Meeru Kattina Yindlu Evi Meeru - Kattina Kotalu

ఏవి - కొట్టి తిన్న పొట్టలు ఉన్నవా?

Evi - Kotti Thinna Pottalu Unnavaa?

మెట్టలు పల్లాలవ్వక మానునా - గనుక ||నమ్మ||

Mettalu Pallaalavvaka Maanunaa - Ganuka ||Namma||

3. త్రవ్విన బావులు ఏవి - మీరు త్రాగిన నదులు ఏవి

3. Thravvina Baavulu Evi - Meeru Thraagina Nadulu Evi

ఏరులు ఎండకుండునా? కారులు మరచెడకుండునా - గనుక ||నమ్మ||

Erulu Endakundunaa? Kaarulu Marachedakundunaa - Ganuka ||Namma||

4. మీరు కట్టిన బట్టలు - ఏవి - చుట్టి త్రాగిన చుట్టలు ఏవి -

4. Meeru Kattina Battalu - Evi - Chutti Thraagina Chuttalu Evi -

కట్టినబట్ట మట్టికెకదా? చుట్టిన చుట్ట అగ్గికి కదా - గనుక ||నమ్మ||

Kattinabatta Mattikekadaa? Chuttina Chutta Aggiki Kadaa - Ganuka ||Namma||

5. మనం మట్టినుండి తీయబడితిమి - మట్టితో పుట్టబడితిమి - ఎట్టి

5. Manan Mattinundi Theeyabadithimi - Mattitho Puttabadithimi - Etti

బ్రతుకు బ్రతికినగాని కట్టెకాటికి పదపదరన్నా - గనుక ||నమ్మ||

Brathuku Brathikinagaani Kattekaatiki Padapadarannaa - Ganuka ||Namma||

6. యేసు ప్రభుని నమ్మండిప్పుడే - మోసపోకుడి ఈ ధరణిలో -

6. Yesu Prabhuni Nammandippude - Mosapokudi Ee Dharanilo -

ప్రయాసపడి భారమును మోసెడి ఓ ప్రజలారా - గనుక ||నమ్మ||

Prayaasapadi Bhaaramunu Mosedi O Prajalaaraa - Ganuka ||Namma||

Related Telugu Christian Songs