నాతో మాట్లాడుమయ్యా
Naatho Maatlaadumayyaa
నాతో మాట్లాడుమయ్యా – నన్నూ దర్శించుమయ్యా
Naatho Maatlaadumayyaa – Nannoo Darshinchumayyaa
నీ మందిరాన – నీ సన్నిధాన – నీ ఆత్మతో నన్ను – నింపుమయా
Nee Mandiraana – Nee Sannidhaana – Nee Aathmatho Nannu – Nimpumayaa
యేసయ్యా... ఆ... ఆ... (3) ||యేసయ్యా|| (2)
Yesayyaa... Aa... Aa... (3) ||Yesayyaa|| (2)
కన్నీళ్ళైనా కష్టాలెదురైన కడవరకు నను చేర్చుమయ్యా
Kanneellainaa Kashtaaleduraina Kadavaraku Nanu Cherchumayyaa
కరువు తోడైన – కలిమి వేరైనా కరుణించి కాపాడుమయ్యా
Karuvu Thodaina – Kalimi Verainaa Karuninchi Kaapaadumayyaa
నా వేదనలో నీ జాలితో – నా శోధనలో నీ చేతితో
Naa Vedanalo Nee Jaalitho – Naa Shodhanalo Nee Chethitho
నిత్యము నను నడిపించుమయ్యా...
Nithyamu Nanu Nadipinchumayyaa...
నా వారే నన్ను నిందించువేళ – నను విడిచి పోబోకుమయ్యా
Naa Vaare Nannu Nindinchuvela – Nanu Vidichi Pobokumayyaa
ఆదరణ నాకు కరువైనవేళ – దరి చేర్చి ఓదార్చుమయ్యా
Aadarana Naaku Karuvainavela – Dari Cherchi Odaarchumayyaa
నా నిందలలో నా తోడువై – అపనిందలలో నా చేరువై
Naa Nindalalo Naa Thoduvai – Apanindalalo Naa Cheruvai
నిత్యము నను నడిపించుమయ్యా
Nithyamu Nanu Nadipinchumayyaa
నా కాలు జారి తొట్రిల్లువేళ – చేజాచి నిలబెట్టుమయ్యా
Naa Kaalu Jaari Thotrilluvela – Chejaachi Nilabettumayyaa
సాతాను నన్ను బంధించువేళ – నను చేరి విడిపించుమయ్యా
Saathaanu Nannu Bandhinchuvela – Nanu Cheri Vidipinchumayyaa
నీ చేతితో నను పట్టుకో – నీ సేవలో నను వాడకో
Nee Chethitho Nanu Pattuko – Nee Sevalo Nanu Vaadako
నిత్యము నను నడిపించుమయ్యా
Nithyamu Nanu Nadipinchumayyaa