నాకేమి కొదువ
Naakemi Koduva
నాకేమి కొదువ - నాధుడుండ నింక = శ్రీకరుండగు దేవుడే నా -
Naakemi Koduva - Naadhudunda Ninka = Shreekarundagu Devude Naa -
శ్రేష్ఠ పాలకుడు - నా - యేక రక్షకుండు గనుక ||నాకేమి||
Shreshtha Paalakudu - Naa - Yeka Rakshakundu Ganuka ||Naakemi||
1. తనివి దీర మేళ్లనుభవింప - నేను = నను సదా మేళ్లనెడి పచ్చిక -
1. Thanivi Deera Mellanubhavimpa - Nenu = Nanu Sadaa Mellanedi Pachchika -
నదిమి మృదువుగ - బండు - కొనజేయును గనుక ||నాకేమి||
Nadimi Mruduvuga - Bandu - Konajeyunu Ganuka ||Naakemi||
2. ఎంత శోధన - యెండ యున్న - నాకు = నెంతకు నోరిగర దెపుడు -
2. Entha Shodhana - Yenda Yunna - Naaku = Nenthaku Norigara Depudu -
శాంత జలములు - నా చెంతనే యుండువ గనుక ||నాకేమి||
Shaantha Jalamulu - Naa Chenthane Yunduva Ganuka ||Naakemi||
3. తప్పిపోయిన నన్ - దారిం బెట్టి - నన్ను = తెప్పరిల్ల జేసి నాకు నీరు
3. Thappipoyina Nan - Daarin Betti - Nannu = Thepparilla Jesi Naaku Neeru
నలసటను - నా - తప్పు మన్నించున్ కనుక ||నాకేమి||
Nalasatanu - Naa - Thappu Manninchun Kanuka ||Naakemi||
4. నీతి మార్గమునన్ - నిల్పున్ నన్ను - ప్రభువు = నీతి లేని నాకు దనను
4. Neethi Maargamunan - Nilpun Nannu - Prabhuvu = Neethi Leni Naaku Dananu
- నీతి దయ చేయున్ - స్వ - నీతిని ద్రుంచున్ గనుక ||నాకేమి||
- Neethi Daya Cheyun - Sva - Neethini Drunchun Ganuka ||Naakemi||
5. చావు చీకట్లు - శక్తియుండు - ఆహా = లోయలోబడి పోవలసినను -
5. Chaavu Cheekatlu - Shakthiyundu - Aahaa = Loyalobadi Povalasinanu -
నే వెరవకుందును - నా - దేవుండే తోడు గనుక ||నాకేమి||
Ne Veravakundunu - Naa - Devunde Thodu Ganuka ||Naakemi||
6. మీదబడునట్టి - శోధనలన్ - ధరను = నా దరికి రానీక దండము -
6. Meedabadunatti - Shodhanalan - Dharanu = Naa Dariki Raaneeka Dandamu -
నన్ను బ్రోచుచును - నా - కాదరణ యౌను గనుక ||నాకేమి||
Nannu Brochuchunu - Naa - Kaadarana Yaunu Ganuka ||Naakemi||
7. పగవారల్ సిగ్గు - పడునట్లుగ - నా = జగము యెరుగని సౌఖ్య భోజన
7. Pagavaaral Siggu - Padunatluga - Naa = Jagamu Yerugani Saukhya Bhojana
మగపరచును - హో - తగినదే పెట్టున్ గనుక ||నాకేమి||
Magaparachunu - Ho - Thaginade Pettun Ganuka ||Naakemi||
8. తన యాత్మానంద - తైలంబుతో - ప్రభువు = ననుదినము తలయంటి
8. Thana Yaathmaananda - Thailambutho - Prabhuvu = Nanudinamu Thalayanti
విసుగ - కొనక తుడుచును - నా కన్నీళ్ళన్ని గనుక ||నాకేమి||
Visuga - Konaka Thuduchunu - Naa Kanneellanni Ganuka ||Naakemi||
9. పలువిధములైన భాగ్యములతో - తండ్రి = వెలుపలికి దిగవెడలునట్టి - వెల
9. Paluvidhamulaina Bhaagyamulatho - Thandri = Velupaliki Digavedalunatti - Vela
గల గిన్నె - నా కలిమిగా జేయున్ గనుక ||నాకేమి||
Gala Ginne - Naa Kalimigaa Jeyun Ganuka ||Naakemi||
10. బ్రదుకంతటన్ గృ - పా క్షేమములు - నా = వదలకుండగ వచ్చు
10. Bradukanthatan Gru - Paa Kshemamulu - Naa = Vadalakundaga Vachchu
నాతో - సుదినములు గల్గ - నా - పదలు సంపదలౌ గనుక ||నాకేమి||
Naatho - Sudinamulu Galga - Naa - Padalu Sampadalau Ganuka ||Naakemi||
11. దురితంబు లుండు - ధరణి నాకు నిజము = నిరవు కాదిక నెప్పటికి
11. Durithambu Lundu - Dharani Naaku Nijamu = Niravu Kaadika Neppatiki
నా - పరమ దేవుని - మం - దిరమే నా యిల్లు గనుక ||నాకేమి||
Naa - Parama Devuni - Man - Dirame Naa Yillu Ganuka ||Naakemi||