నాదు దేవా నాదు దేవా

Naadu Devaa Naadu Devaa

Telugu by సీయోను గీతాలు

నాదు దేవా నాదు దేవా

Naadu Devaa Naadu Devaa

నన్నేల విడనాడితివయ్యా (2)

Nannela Vidanaadithivayyaa (2)

నన్ను రక్షింపక ఆర్తధ్వని (2)

Nannu Rakshimpaka Aarthadhvani (2)

వినక నీవేల దూరమున్నావు? (2) ||నాదు||

Vinaka Neevela Dooramunnaavu? (2) ||Naadu||

1. రాత్రింబగళ్ళు మొఱ్ఱబెట్టగా

1. Raathrimbagallu Morrapettagaa

ఏల నుత్తరమీయకున్నావు (2)

Ela Nuttharameeyakunnaavu (2)

ఇశ్రేయేలు స్తోత్రముపై కూర్చున్న (2)

Ishraayelu Sthothramupai Koorchunna (2)

పరిశుద్ధ దేవుడవై యున్నావు (2) ||నాదు||

Parishuddha Devudavai Yunnaavu (2) ||Naadu||

2. మా పితరులు నీయందు

2. Maa Pitharulu Neeyandu

విశ్వసించగా రక్షించితివి (2)

Vishvasinchagaa Rakshinchithivi (2)

మొఱలిడి నిన్ను నమ్మిరి (2)

Moralidi Ninnu Nammiri (2)

విడుదలొంది సిగ్గునొందలేదు (2) ||నాదు||

VidudalonDi Siggunondaledu (2) ||Naadu||

3. నరుడను కాను పురుగును

3. Narudanu Kaanu Purugunu

నరులచే నిందింపబడితి (2)

Narulache Nindimpabadithi (2)

నరులచే తృణీకారము (2)

Narulache Thruneekaaramu (2)

పొందియున్న వాడనైతిని (2) ||నాదు||

Pondiyunna Vaadanaithini (2) ||Naadu||

4. నన్ను జూచు వారెల్లరు

4. Nannu Joochu VaarEllaru

తమ పెదవులను విరిచి (2)

Thama Pedavulanu Virichi (2)

తలల నాడించుచున్నారు (2)

Thalala Naadinchuchunnaaru (2)

నన్నపహసించుచున్నారు (2) ||నాదు||

Nannapahasinchuchunnaaru (2) ||Naadu||

5. యెహోవాపై భారముంచుము

5. Yehovaapai Bhaaramunchumu

తాను నిన్ను విడిపించునేమో (2)

Thaanu Ninnu Vidipinchunemo (2)

వాడాయన కిష్టుడు కాడా (2)

Vaadaayana Kishtudu Kaadaa (2)

వాని తప్పించునేమో యందురు (2) ||నాదు||

Vaani Thappinchunemo Yanduru (2) ||Naadu||

6. గర్భమునుండి నన్ దీసిన వాడా

6. Garbhamunundi Nan Deesina Vaadaa

నా తల్లి యొద్ద స్తన్యపానము (2)

Naa Thalli Yodda Sthanyapaanamu (2)

చేయుచుండగా నీవే కాదా (2)

Cheyuchundagaa Neeve Kaadaa (2)

నాకు నమ్మిక పుట్టించితివి (2) ||నాదు||

Naaku Nammika Puttinchithivi (2) ||Naadu||

7. గర్భవాసినైనది మొదలు

7. Garbhavaasinainadi Modalu

నుండి నా కాధారము నీవే (2)

Nundi Naa Kaadhaaramu Neeve (2)

నన్ను దల్లి కనిన నాటి (2)

Nannu Dalli Kanina Naati (2)

నుండి నా దేవుడవు నీవే (2) ||నాదు||

Nundi Naa Devudavu Neeve (2) ||Naadu||

Related Telugu Christian Songs