నా యేసు మార్గమందున

Naa Yesu Maargamanduna

Telugu by సీయోను గీతాలు

1. నా యేసు మార్గమందున

1. Naa Yesu Maargamanduna

వెళ్ళ నాయత్తమా? (2)

Vella Naayatthamaa? (2)

గొల్గొతా కొండ బాధలో

Golgothaa Konda Baadhalo

పాలు పొందెదవా? (2)

Paalu Pondedavaa? (2)

సిలువను వీడను - సిలువను వీడను

Siluvanu Veedanu - Siluvanu Veedanu

సిలువను వీడను - సిలువను వీడను - సిలువను వీడను

Siluvanu Veedanu - Siluvanu Veedanu - Siluvanu Veedanu

సిలువను సిలువను వీడను

Siluvanu Siluvanu Veedanu

2. బంధుమిత్రుల మధ్యను

2. Bandhumithrula Madhyanu

శ్రమ సహింతువా? (2)

Shrama Sahinthuvaa? (2)

మూర్ఖ కోపిష్టుల మధ్య

Moorkha Kopishtula Madhya

దిట్టముగ నుందువా? (2) ||సిలువను||

Dittamuga Nunduvaa? (2) ||Siluvanu||

3. ఆకలి దాహ బాధలో

3. Aakali Daaha Baadhalo

ధైర్యంబుగ నిల్తువా? (2)

Dhairyambuga Nilthuvaa? (2)

అవమానము వచ్చినన్

Avamaanamu Vachchinan

సిల్వను మోతువా? (2) ||సిలువను||

Silvanu Mothuvaa? (2) ||Siluvanu||

4. పాపాత్ములు గుణపడన్

4. Paapaathmulu Gunapadan

దత్తము చేతువా? (2)

Dattamu Chethuvaa? (2)

భయస్థులు ధైర్యపడన్

Bhayasthulu Dhairyapadan

యుద్ధము చేతువా? (2) ||సిలువను||

Yuddhamu Chethuvaa? (2) ||Siluvanu||

5. లోకులు నాశమైరిగా

5. Lokulu Naashamairigaa

వీరులు లేకయే (2)

Veerulu Lekaye (2)

విమోచకుడు సిల్వలో

Vimochakudu Silvalo

వ్రేలాడి మృతి పొందెను (2) ||సిలువను||

Vrelaadi Mruthi Pondenu (2) ||Siluvanu||

6. జీవాంతరము వరకు

6. Jeevaantharamu Varaku

నిల్చి పోరు సల్పి (2)

Nilchi Poru Salpi (2)

దైవ కృపచే గెల్చి నే

Daiva Krupache Gelchi Ne

మోక్షము చేరుదున్ (2) ||సిలువను||

Mokshamu Cherudun (2) ||Siluvanu||

Related Telugu Christian Songs