నా రక్షకా యేసునాధ
Naa Rakshakaa Yesunaadha
నా రక్షకా యేసునాధ ఇమ్మానుయేలు - ఘోర పాపుల పాప భార విమోచక ||నా రక్షకా||
Naa Rakshakaa Yesunaadha Immaanuyelu - Ghora Paapula Paapa Bhaara Vimochaka ||Naa Rakshakaa||
1. నిత్యకాలమునందు - నిజమైన దేవుని - సత్యవాక్యమై యున్న
1. Nithyakaalamunandu - Nijamaina Devuni - Sathyavaakyamai Yunna
స్వామి నిన్నుతియింతు ||నా రక్షకా||
Svaami Ninnuthiyinthu ||Naa Rakshakaa||
2. సర్వ లోకంబులను - సత్యవాక్యమై యుండి - నిర్వహించిన దేవుని
2. Sarva Lokambulanu - Sathyavaakyamai Yundi - Nirvahinchina Devuni
నిజబాహువా స్తుతింతు ||నా రక్షకా||
Nijabaahuvaa Sthuthinthu ||Naa Rakshakaa||
3. దేవజనులకు - సువార్త దెలుప నభిషేకంబు
3. Devajanulaku - Suvaartha Delupa Nabhishekambu
పూని నొందిన దేవపుత్రుడ నుతియింతు ||నా రక్షకా||
Pooni Nondina Devaputhruda Nuthiyinthu ||Naa Rakshakaa||
4. దేవ మహిమ ప్రకాశ - దీనరక్షక మానుష్యావతారము దాల్చి
4. Deva Mahima Prakaasha - Deenarakshaka Maanushyaavathaaramu Daalchi
యావదాజ్ఞల దీర్చిన ||నా రక్షకా||
Yaavadaajnyala Deerchina ||Naa Rakshakaa||
5. పావనాద్భుతుడవై - పరమ జ్ఞానము గలిగి
5. Paavanaadbhuthudavai - Parama Gnaanamu Galigi
దేవస్వభావ ముద్ర - దేదీప్యుడా స్తుతింతు ||నా రక్షకా||
Devasvabhaava Mudra - Dedeepyudaa Sthuthinthu ||Naa Rakshakaa||
6. పాపాత్ములను గావ - శాపభారము క్రింద - నోపికతో నిల్చి
6. Paapaathmulanu Gaava - Shaapabhaaramu Krinda - Nopikatho Nilchi
ప్రాపు జూపిన ప్రభువా ||నా రక్షకా||
Praapu Joopina Prabhuvaa ||Naa Rakshakaa||
7. ఈ వసుధను ప్రేమ - నెసగునట్లుగ జూపి
7. Ee Vasudhanu Prema - Nesagunatluga Joopi
చావు గెల్చిన సర్వసామర్థ్యుడా స్తుతింతు ||నా రక్షకా||
Chaavu Gelchina Sarvasaamarthyudaa Sthuthinthu ||Naa Rakshakaa||
8. ఘన దేవుని కుడి పార్శ్వమున - గూర్చుండి విజ్ఞప్తి
8. Ghana Devuni Kudi Paarshvamuna - Goorchundi Vijnyapthi
నొనరించు నా యేసు - వినయ స్తోత్రంబిదిగో ||నా రక్షకా||
Nonarinchu Naa Yesu - Vinaya Sthothrambidigo ||Naa Rakshakaa||