నా కాల్గతు లెవ్వి

Naa Kaalgathu Levvi

Telugu by పులిపాక జగన్నాధము • andhra-kraisthava-keerthanalu

నా కాల్గతు లెవ్వి - నా చేతులను లేవు - నాదు దేవ = యెప్పుడు - నీకే

Naa Kaalgathu Levvi - Naa Chethulanu Levu - Naadu Deva = Yeppudu - Neeke

వాని మీద - నిత్యాధికారంబు - నిల్చియుండు ||నా||

Vaani Meeda - Nithyaadhikaarambu - Nilchiyundu ||Naa||

1. తల్లిగర్భంబున - దసర సృజించితివి - ధరణి నన్ను = నీవు - తల్లికన్నను

1. Thalligarbhambuna - Dasara Srujinchithivi - Dharani Nannu = Neevu - Thallikannanu

మిగుల - దయచేత జూచితివి - తండ్రి నన్ను ||నా||

Migula - Dayachetha Joochithivi - Thandri Nannu ||Naa||

2. పాప కూపమునందు - బడియుండగా నన్ను - బారజూచి =

2. Paapa Koopamunandu - Badiyundagaa Nannu - Baarajoochi =

చేయి - చాపి యేసునిద్వార - చక్కగాదెచ్చితివి - చాలు దేవ ||నా||

Cheyi - Chaapi Yesunidvaara - Chakkagaadechchithivi - Chaalu Deva ||Naa||

3. సుఖదుఃఖ కాలములు - శోధింప - బంపుదువు - శోభాయుక్త = నాకు

3. Sukhaduhkha Kaalamulu - Shodhimpa - Bampuduvu - Shobhaayuktha = Naaku

- సుఖము గల్గజేయు - సొంపుగ వానిచే - స్థూల శక్తి ||నా||

- Sukhamu Galgajeyu - Sompuga Vaaniche - Sthoola Shakthi ||Naa||

4. సకల కాలంబుల - జక్కగా లోబడి - నన్నుతింతు = నన్ను -

4. Sakala Kaalambula - Jakkagaa Lobadi - Nannuthinthu = Nannu -

ఆకలంకునిగా జేయు - మనుచు వేడుచునుందు - నధికాసక్తి ||నా||

Aakalankunigaa Jeyu - Manuchu Veduchunundu - Nadhikaasakthi ||Naa||

Related Telugu Christian Songs