మేము వెళ్లిచూచినాము

Memu Vellichoochinaamu

Telugu • andhra-kraisthava-keerthanalu

మేము వెళ్లిచూచినాము - స్వామి యేసుక్రీస్తును = ప్రేమ మొక్కి వచ్చినాము

Memu Vellichoochinaamu - Svaami Yesukreesthunu = Prema Mokki Vachchinaamu

మా మనంబులలరగ ||మేము||

Maa Manambulalaraga ||Memu||

1. బేదలేము పురములోన - బీద కన్యమరియకుం = బేదగా సురూపుం దాల్చి

1. Bedalemu Puramulona - Beeda Kanyamariyakun = Bedagaa Suroopun Daalchi

వెలసెం బశులపాకలో ||మేము||

Velasen Bashulapaakalo ||Memu||

2. జ్ఞానులమని గర్వపడక - దీనులమై నిత్యము = వాని ప్రేమ సకల ప్రజకు

2. Gnaanulamani Garvapadaka - Deenulamai Nithyamu = Vaani Prema Sakala Prajaku

మానక ప్రకటింతము ||మేము||

Maanaka Prakatinthamu ||Memu||

3. తద్దరిశనమందు మాకుం - బెద్ద మేలు గలిగెగా = హద్దులేని పాపమంత

3. Thaddarishanamandu Maakun - Bedda Melu Galigegaa = Hadduleni Paapamantha

రద్దుపరచబడెనుగా ||మేము||

Radduparachabadenugaa ||Memu||

4. మరణమెపుడొ రేపొమాపో - మరియెపుడో మన మెరుగము = త్వరగా

4. Maranamepudo Repomaapo - Mariyepudo Mana Merugamu = Thvaragaa

పోయి పరమగురుని - దరిశనంబుం జేతము ||మేము||

Poyi Paramaguruni - Darishanambun Jethamu ||Memu||

5. పరిశుద్ధాత్మ జన్మ మాకు - వరముగా నొసంగెను = పరమపురము మాకు

5. Parishuddhaathma Janma Maaku - Varamugaa Nosanggenu = Paramapuramu Maaku

హక్కు పంచెదాను నిరతము ||మేము||

Hakku Panchedaanu Nirathamu ||Memu||

6. మాకు సర్వగర్వమణిగి - మంచి మార్గమబ్బెను = మాకు నీ సువార్తం జెప్ప

6. Maaku Sarvagarvamanigi - Manchi Maargamabbenu = Maaku Nee Suvaarthan Jeppa

మక్షువెంతోం గలిగెను ||మేము||

Makshuventhon Galigenu ||Memu||

Related Telugu Christian Songs