మేలుకొనరే మా మనంబుల

Melukonare Maa Manambula

Telugu by మిక్కిలి సమూయేలు • andhra-kraisthava-keerthanalu

మేలుకొనరే మా మనంబుల - మేలిమిగ మా మేర దప్పక

Melukonare Maa Manambula - Melimiga Maa Mera Dappaka

పాలుమాలక లేచి దేవుని - పాదములు పూజింప గ్రక్కున ||మేలుకొనరే||

Paalumaalaka Lechi Devuni - Paadamulu Poojimpa Grakkuna ||Melukonare||

1. దిక్కులెల్లను దేజరిల్లెను - దినకరుం డుదయింపనయ్యెను

1. Dikkulellanu Dejarillenu - Dinakarum Dudayimpanayyenu

మొక్కులకు ప్రతిఫలము నిచ్చెడు - మూల కర్తకు గొలువసేయంగ ||మేలుకొనరే||

Mokkulaku Prathiphalamu Nichchedu - Moola Karthaku Goluvaseyamga ||Melukonare||

2. పక్షులెల్లను గిలకిలంచును - ప్రభుని మహిమలు బల్మం బాడెదను

2. Pakshulellanu Gilakilamchunu - Prabhuni Mahimalu Balmam Baadedanu

రక్షకుని సకలోపకృతులను - రమ్యముగ నుతియించి పాడంగ ||మేలుకొనరే||

Rakshakuni Sakalopakruthulanu - Ramyamuga Nuthiyimchi Paadamga ||Melukonare||

3. నిదుర బోయిన వేళ మిమ్మొక - నిమిషమైనను బాసియుండక

3. Nidura Boyina Vela Mimmoka - Nimishamainanu Baasiyumdaka

పదిలముగ రక్షించు దేవుని - ప్రస్తుతింప మహాముదంబున ||మేలుకొనరే||

Padilamuga Rakshimchu Devuni - Prasthuthimpa Mahaamudambuna ||Melukonare||

4. మేటియౌ హృదయాబ్దములలో - మా కృతజ్ఞతా భూషణంబులు

4. Metiyau Hrudayaabdamulalo - Maa Kruthagnathaa Bhooshanambulu

నేటుగా ధరియించుకొని యిటు - నిర్మలాత్మునిం బూజసేయంగ ||మేలుకొనరే||

Netugaa Dhariyimchukoni Yitu - Nirmalaathmunim Boojaseyamga ||Melukonare||

5. తెల్లవారంగం దెలియరే యిది - తెలివిగల మానవ సమాజము

5. Thellavaaramgam Deliyare Yidi - Thelivigala Maanava Samaajamu

యుల్లసిల్లుచు నీతి భాస్కరుం - డుదయ మయ్యెను హృదయముల పై ||మేలుకొనరే||

Yullasilluchu Neethi Bhaaskarum - Dudaya Mayyenu Hrudayamula Pai ||Melukonare||

Related Telugu Christian Songs