మంగళంబని పాడరే క్రీస్తుకు
Manggalambani Paadare Kreesthuku
మంగళంబని పాడరే - క్రీస్తుకు జయ
Manggalambani Paadare - Kreesthuku Jaya
మంగళంబని పాడరే - యేసుకు జయ
Manggalambani Paadare - Yesuku Jaya
మంగళంబని పాడరే - మంగళంబని పాడి
Manggalambani Paadare - Manggalambani Paadi
సజ్జన సమూహ పూజితుడై - కృపాతరంగిలోక సమూహ పాపవిభంగుడని
Sajjana Samooha Poojithudai - KrupaాTharanggiloka Samooha Paapavibhanggudani
యుప్పాంగి జయజయ ||మంగళ||
Yuppaanggi Jayajaya ||Manggala||
1. ఘన యూద దేశంబులో - బెత్లెహేమున యూదా గోత్రంబులో
1. Ghana Yooda Deshambulo - Bethlehemuna Yoodaa Gothrambulo
వినుండు యోసేపునకు సతియై - తనరుచుండెడి మరియ కడుపున
Vinundu Yosepunaku Sathiyai - Thanaruchundedi Mariya Kadupuna
జననమై యీ మర్త్య వరులకు - సద్గతిని గల్లించు వానికి ||మంగళ||
Jananamai Yee Marthya Varulaku - Sadgathini Gallinchu Vaaniki ||Manggala||
2. సోదరాలి భంగిని - భక్తుల నెల్ల జూచి బ్రోచెడు వానిని
2. Sodaraali Bhanggini - Bhakthula Nella Joochi Brochedu Vaanini
యూద దేశపు వారలధిక - బాధ బెట్టుచు హింసంజేసిన
Yooda Deshapu Vaaraladhika - Baadha Bettuchu Hinsanjesina
సాదరంబున త్రిదినములకు - ముదముతో గనుపడిన ప్రభునకు ||మంగళ||
Saadarambuna Thridinamulaku - Mudamutho Ganupadina Prabhunaku ||Manggala||
3. ధరణి నొల్లడి దాసజనములనుంబ్రోచు - దైవ తనయుండని నిజ
3. Dharani Nolladi Daasajanamulanumbrochu - Daiva Thanayundani Nija
మరయ నిలను స్మరించువారికి - గురుతరంబగు కలుష జలనిధి
Maraya Nilanu Smarinchuvaariki - Gurutharambagu Kalusha Jalanidhi
దరికిం జేర్చు పరమ పదమే - యిరు వొనర్చెద ననిన ప్రభునకు ||మంగళ||
Darikin Jerchu Parama Padame - Yiru Vonarcheda Nanina Prabhunaku ||Manggala||