మంచి కాపరి
Manchi Kaapari
మంచి కాపరి మా ప్రభుయేసే – మా కొరకు ప్రాణ మిచ్చె గొప్పకాపరి
Manchi Kaapari Maa Prabhuyese – Maa Koraku Praana Michche Goppakaapari
మరణమైనను భయములేదులే – మధురమైన ప్రేమతో మమ్ముకాయులే
Maranamainanu Bhayamuledule – Madhuramaina Prematho Mammukaayule
పచ్చిక బయళ్ళులో విశ్రమించగా – శాంతి జలాల చెంత అడుగు వేయగా
Pachchika Bayallulo Vishraminchagaa – Shaanthi Jalaala Chentha Adugu Veyagaa
చేయివిడవక తోడు నిలుచును – నీతి మార్గమందు మమ్ము నడువచేయును
Cheyividavaka Thodu Niluchunu – Neethi Maargamandu Mammu Naduvacheyunu
అంధకారలోయలో మ పయనంలో లేదులే – మాకుభయం అభయం తానే
Andhakaaraloyalo Ma Payananlo Ledule – Maakubhayan Abhayan Thaane
ఆదరించును ఆశీర్వదించును – అన్నితావులయందు తానేతోడైయుండును
Aadarinchunu Aasheervadinchunu – Annithaavulayandu Thaanethodaiyundunu
శత్రువుల మధ్యలో మాకు భోజనం అభిషేకం ఆనందం కృపాక్షేమమే
Shathruvula Madhyalo Maaku Bhojanan Abhishekan Aanandam Krupaakshemame
బ్రతుకునిండా పొంగిపొర్లగా చిరకాలం ఆయనతో జీవించగా
Brathukunindaa Ponggiporlagaa Chirakaalan Aayanatho Jeevinchagaa