మంచి దేవుడు
Manchi Devudu
మంచి దేవుడు భలే మంచి దేవుడు
Manchi Devudu Bhale Manchi Devudu
నిజదైవం యేసు – అద్వితీయ దేవుడు ||మంచి||
Nijadaivan Yesu – Advitheeya Devudu ||Manchi||
మ్రొక్కులను కోరడు మనసిస్తే చాలును
Mrokkulanu Koradu Manasisthe Chaalunu
కొండలెక్కి రమ్మనడు – మనలో కొలువుంటాడు
Kondalekki Rammanadu – Manalo Koluvuntaadu
వెదికే ప్రతి వారికి దొరికెను యేసు
Vedike Prathi Vaariki Dorikenu Yesu
పిలిచే ప్రతి వారికి పలికేసు దేవుడు ||మంచి||
Piliche Prathi Vaariki Palikesu Devudu ||Manchi||
కుంటి వారు గంతులేయ – కాళ్ళు నొసగినాడు
Kunti Vaaru Ganthuleya – Kaallu Nosaginaadu
మూగవారు స్తుతిచేయ – నోటినిచ్చినారు
Moogavaaru Sthuthicheya – Notinichchinaaru
బధిరులు తన స్వరమువిని – చెవులిచ్చినాడు
Badhirulu Thana Svaramuvini – Chevulichchinaadu
ప్రేమామయుడు – ఆశ్చర్య దేవుడు ||మంచి||
Premamayudu – Aashcharya Devudu ||Manchi||
చెప్పింది చేసేను – మాదిరుంచి వెళ్ళెను
Cheppindi Chesenu – Maadirunchi Vellenu
అడుగు జాడలుంచెను – అనుసరించకోరెను
Adugu Jaadalunchenu – Anusarinchakorenu
మరణాన్ని జీవాన్ని మన ఎదుటే ఉంచెను
Maranaanni Jeevaanni Mana Edute Unchenu
ఎంచుకొనే స్వేచ్చను – మన చేతికిచ్చెను
Enchukone Svechchanu – Mana Chethikichchenu
ఏమి చేతువో – నీవు సృష్టికర్త యేసుని ||మంచి||
Emi Chethuvo – Neevu Srushtikartha Yesuni ||Manchi||