మనసా వినవేమే

Manasaa Vinaveme

Telugu by బికోటయ్య • andhra-kraisthava-keerthanalu

మనసా వినవేమే - క్రీస్తుని -గని సేవింపవేమే = అనుదినమున నీ కాయువు

Manasaa Vinaveme - Kreesthuni -Gani Sevimpaveme = Anudinamuna Nee Kaayuvu

క్షీణం = బగుచున్నది గదవే ॥మనసా॥

Ksheenan = Baguchunnadi Gadave ॥Manasaa॥

1. చింతలేల నీకు - వర శ్రీ - మంతుడుండు వరకు = చెంతను జేరక

1. Chinthalela Neeku - Vara Shree - Manthudundu Varaku = Chenthanu Jeraka

యెంతసేపు నీ - యంతట నుండెదవే ॥మనసా॥

Yenthasepu Nee - Yanthata Nundedave ॥Manasaa॥

2. లోకాశలకును - నీవు - లోకువై యుండకుము = ఆకాశము నేలెడు మన

2. Lokaashalakunu - Neevu - Lokuvai Yundakumu = Aakaashamu Neledu Mana

ప్రభువును - ప్రాకటముగ నమ్ము ॥మనసా॥

Prabhuvunu - Praakatamuga Nammu ॥Manasaa॥

3. మాయ సంతలోన - జిక్కి - మాయలం బోయెదవు = కాయము స్థిరమని

3. Maaya Santhalona - Jikki - Maayalan Boyedavu = Kaayamu Sthiramani

నమ్మకు మో నీ - ప్రాయము దక్కదుగా ॥మనసా॥

Nammaku Mo Nee - Praayamu Dakkadugaa ॥Manasaa॥

4 రక్షకయని వేయడు - నీవు - రక్షణకై వేయడు = రక్షణం బొందుట కిదియే

4 Rakshakayani Veyadu - Neevu - Rakshanakai Veyadu = Rakshanan Bonduta Kidiye

సమయము తక్షణమున వేండు ॥మనసా॥

Samayamu Thakshanamuna Vendu ॥Manasaa॥

5. అందరమును గూడి - యేసుని - మందిరమునం జేరి = పొందుగ క్రీస్తుని

5. Andaramunu Goodi - Yesuni - Mandiramunan Jeri = Ponduga Kreesthuni

పొగడుచుం బాడుచు - నందునం జేరుదము ॥మనసా॥

Pogaduchun Baaduchu - Nandunan Jerudamu ॥Manasaa॥

Related Telugu Christian Songs