మధురమైన ఈ సమయాన
Madhuramaina Ee Samayaana
మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెద
Madhuramaina Ee Samayaana Prabhuni Paata Paadeda
సుధలు చిందు ఆ నామమును భువిని నేను చాటెద
Sudhalu Chindu Aa Naamamunu Bhuvini Nenu Chaateda
ఎంత ఘోరపాపులనైనా మార్చివేయును
Entha Ghorapaapulanainaa Maarchiveyunu
ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును
Entha Kathina Hrudayamulainaa Karigipovunu
యేసు కరుణ వాక్కులే ప్రేమపూరితం
Yesu Karuna Vaakkule Premapoorithan
ఎంచలేని దివ్య ప్రేమ యేసు సిల్వ ప్రేమ
Enchaleni Divya Prema Yesu Silva Prema
ఎంచిచూడ ఏది లేదు మంచితనము నాలో
Enchichooda Edi Ledu Manchithanamu Naalo
యేసు రక్తధారలే క్షమాసహితము
Yesu Rakthadhaarale Kshamaasahithamu
కష్టమైన నష్టమైన క్రీస్తే ఆశ్రయం
Kashtamaina Nashtamaina Kreesthe Aashrayan
హింసయైన బాధయైన లేదు ఏ భయం
Hinsayaina Baadhayaina Ledu E Bhayan
యేసు మధుర నామమే రక్షణకారకం
Yesu Madhura Naamame Rakshanakaarakang