మార్పు లేని ప్రేమ నీది

Maarpu Leni Prema Needi

Telugu by కరుణ పాల్

మార్పు లేని ప్రేమ నీది నను మార్చినది

Maarpu Leni Prema Needi Nanu Maarchinadi

ఎన్నడూ ఎడబాయని ప్రేమే నీది (2)

Ennadoo Edabaayani Preme Needi (2)

మనసార నిను పాడెదా

Manasaara Ninu Paadedaa

మరువక నీ ప్రేమనే కొనియాడెదా (2)

Maruvaka Nee Premane Koniyaadedaa (2)

ఆరాధింతునయ్య నా మంచి యేసయ్యా (4) ||మార్పు||

Aaraadhinthunayya Naa Manchi Yesayyaa (4) ||Maarpu||

1. ఆపదలో చిక్కినప్పుడు విడుదలిచ్చినావు

1. Aapadalo Chikkinappudu Vidudalichchinaavu

ఆవేదన కలిగినపుడు ఆదరించినావు (2)

Aavedana Kaliginapudu Aadarinchinaavu (2)

ప్రతి క్షణమున నన్ను కాచినావు

Prathi Kshanamuna Nannu Kaachinaavu

ప్రతి స్థలమునందు నీ సాక్షిగ నిలిపావు (2)

Prathi Sthalamunandu Nee Saakshiga Nilipaavu (2)

ఆరాధింతునయ్యా నా మంచి యేసయ్యా (4) ||మార్పు||

Aaraadhinthunayyaa Naa Manchi Yesayyaa (4) ||Maarpu||

2. పోరాటమునందు నాకు విజయమిచ్చినావు

2. Poraatamunandu Naaku Vijayamichchinaavu

అవమానము తొలగించి ఘనతనిచ్చినావు (2)

Avamaanamu Tholaginchi Ghanathanichchinaavu (2)

అన్నివేళలా కృపను చూపినావు

Annivelaalaa Krupanu Choopinaavu

అనురాగపు బంధముతో నన్ను పిలిచినావు (2)

Anuraagapu Bandhamutho Nannu Pilichinaavu (2)

ఆరాధింతునయ్యా నా మంచి యేసయ్యా (4) ||మార్పు||

Aaraadhinthunayyaa Naa Manchi Yesayyaa (4) ||Maarpu||

Related Telugu Christian Songs