మా యేసు క్రీస్తు

Maa Yesu Kreesthu

Telugu by సమూయేలు పాక్యనాధము • andhra-kraisthava-keerthanalu

మా యేసు క్రీస్తు నీవే - మహిమగల రాజవు

Maa Yesu Kreesthu Neeve - Mahimagala Raajavu

నీవు నీవే తండ్రికి - నిత్యకుమారుడవు - ఓ క్రీస్తూ

Neevu Neeve Thamdriki - Nithyakumaarudavu - O Kreesthoo

1. భూనరులన్ రక్షింపం - బూనుకొనినప్పుడు

1. Bhoonarulan Rakshimpam - Boonukoninappudu

దీన కన్యాగర్భముం దిరస్మరింపలేదుగా - ఓ క్రీస్తూ

Deena Kanyaagarbhamum Dirasmarimpaledugaa - O Kreesthoo

2. విజయము మరణపు - వేదనపై నొందంగా

2. Vijayamu Maranapu - Vedanapai Nomdamgaa

విశ్వాసులందరికిన్ విప్పితివి మోక్షమున్ - ఓ క్రీస్తూ

Vishvaasulamdarikin Vippithivi Mokshamun - O Kreesthoo

3. నీవు తండ్రిదైనట్టి - నిత్య మహిమయందు

3. Neevu Thamdridainatti - Nithya Mahimayamdu

దేవుని కుడివైపు దిరముగా గూర్చున్నావు - ఓ క్రీస్తూ

Devuni Kudivaipu Diramugaa Goorchunnaavu - O Kreesthoo

4. నీవు న్యాయాధిపతివై - నిశ్చయముగా వచ్చెదవు

4. Neevu Nyaayaadhipathivai - Nishchayamugaa Vachchedavu

కావున నీ సాయంబు కానిమ్ము నీ దాసులకు - ఓ క్రీస్తూ

Kaavuna Nee Saayambu Kaanimmu Nee Daasulaku - O Kreesthoo

5. దివ్యమౌ రక్తంబు చిందించి నీవు రక్షించిన

5. Divyamau Rakthambu Chimdimchi Neevu Rakshimchina

సేవకులకై మేము చేయు మనవి నాలించు - ఓ క్రీస్తూ

Sevakulakai Memu Cheyu Manavi Naalimchu - O Kreesthoo

6. నీ వారి నెల్లప్పుడును - నిత్య మహిమయందు

6. Nee Vaari Nellappudunu - Nithya Mahimayamdu

నీ పరిశుద్ధులతోను వెంచుకొను మయ్య - ఓ క్రీస్తూ

Nee Parishuddhulathonu Vemchukonu Mayya - O Kreesthoo

7. నీదు జనము రక్షించి - నీ దాయము దీవించుము

7. Needu Janamu Rakshimchi - Nee Daayamu Deevimchumu

నాధా వారలను నేలి లేవనెత్తు మెప్పుడును - ఓ క్రీస్తూ

Naadhaa Vaaralanu Neli Levaneththu Meppudunu - O Kreesthoo

8. దిన దినమును నిన్ను - మహిమ పర్చుచున్నాము

8. Dina Dinamunu Ninnu - Mahima Parchuchunnaamu

ఘనముగా నీ నామమున్ గొప్పచేయుచున్నాము - ఓ క్రీస్తూ

Ghanamugaa Nee Naamamun Goppacheyuchunnaamu - O Kreesthoo

9. నేడు పాపము చేయకుండ - నెనరుతో మము గావుమయ్యా

9. Nedu Paapamu Cheyakumda - Nenarutho Mamu Gaavumayyaa

ప్రభూ నీ దాసులకు పరమ దయ నిమ్మయ్య - ఓ క్రీస్తూ

Prabhoo Nee Daasulaku Parama Daya Nimmayya - O Kreesthoo

10. ప్రభువా కరుణించుము - ప్రభువా కరుణించుము

10. Prabhuvaa Karunimchumu - Prabhuvaa Karunimchumu

ప్రార్థించు నీ దాసులపై దయలనిమ్ము దీవెనలక - ఓ క్రీస్తూ

Praarthimchu Nee Daasulapai Dayalanimmu Deevenalaka - O Kreesthoo

11. నిన్ను నమ్మి యున్నాము - నీ కృప మా పైం జూపుము

11. Ninnu Nammi Yunnaamu - Nee Krupa Maa Paim Joopumu

మేము మోసపోకుండ నీవే కాపాడు మయ్యా - ఓ క్రీస్తూ

Memu Mosapokumda Neeve Kaapaadu Mayyaa - O Kreesthoo

Related Telugu Christian Songs