లోక పాపమును మోసుకెళ్లిన

Loka Paapamunu Mosukellina

Telugu

లోక పాపమును మోసుకెళ్లిన

Loka Paapamunu Mosukellina

దేవుని గొర్రెపిల్ల (2)

Devuni Gorrepilla (2)

నీ రక్తమే పాప పరిహారం

Nee Rakthame Paapa Parihaaram

నీ దేహమే జీవ ఆహారం

Nee Dehame Jeeva Aahaaram

నీ వాక్యమే మాకు ఆధారం

Nee Vaakyame Maaku Aadhaaram

నీ నామమే రక్షణకు మూలం

Nee Naamame Rakshanaku Moolam

నీ విజయమే మాకునూ విజయం ||లోక||

Nee Vijayame Maakunoo Vijayam ||Loka||

1. మొదటి ఆదాముతో – పాపం జనియించెను

1. Modati Aadaamutho – Paapam Janiyinchenu

మరణము సంక్రమించెను (2)

Maranamu Sankraminchenu (2)

ఆ పాపం పోవాలంటే

Aa Paapam Povaalante

ఈ మరణం తొలగాలంటే

Ee Maranam Tholagaalante

మా వల్ల కానేకాదు

Maa Valla Kaanekaadu

పరిశుద్దుడే రావాలి

Parishuddhude Raavaali

ప్రభువా కడపటి ఆదామైనావు

Prabhuvaa Kadapati Aadaamainavu

కలువరి బలిపీఠమునెక్కావు

Kaluvari Balipeethamunekkaavu

నీ ప్రాణమే బలిగా అర్పించి

Nee Praaname Baligaa Arpinchi

మా ప్రాణాలను కాపాడావు

Maa Praanaalanu Kaapaadaavu

మరణాన్నే మ్రింగి వేశావు ||నీ రక్తమే||

Maranaan Ne Mringi Veshaavu ||Nee Rakthame||

2. నీవు పొందిన దెబ్బలచే – మాకు స్వస్థత నిచ్చావే

2. Neevu Pondina Debbalache – Maaku Svasthatha Nichchaave

మాకోసం చీల్చబడినావే (2)

Maakosam Cheelchabadinaave (2)

సూరూపమేమి లేక కురూపివైనావయ్యా

Suroopamemi Leka Kuroopivainaavayyaa

నిను నలుగగొట్టుటకు తండ్రిష్టమాయెనా

Ninu Nalugagottutaku Thandrishtamaayenaa

ప్రభువా నిశ్చయముగ మా రోగాలు

Prabhuvaa Nishchayamuga Maa Rogaalu

భరియించావు నీ దేహములో

Bhariyinchaavu Nee Dehamulo

మా వ్యసనములన్నిటి సహియించి

Maa Vyasanamulanniti Sahiyinchi

మా శాపగ్రాహివైనావు – ఆరోగ్యం మాకు ఇచ్చావు || నీ రక్తమే||

Maa Shaapagraahivainaavu – Aarogyam Maaku Ichchaavu ||Nee Rakthame||

3. శ్రీమంతుడవూ నువ్వు – సృష్టంతటిలో నువ్వు

3. Shreemanthudavoo Nuvvu – Srushtanthitilo Nuvvu

అయినా తగ్గించుకున్నావు (2)

Ayinaa Thagginchukunnaavu (2)

నీవు సృష్టించిన ఈ భువికి దీనుడవై దిగివచ్చావే

Neevu Srushtinchina Ee Bhuviki Deenudavai Digivachchaave

మము ధనవంతులుగా చేయ దారిద్ర్యతనొ౦దావే

Mamu Dhanavanthulugaa Cheya Daaridryathanondaave

ప్రభువా నీ తగ్గింపుకు సమమేది

Prabhuvaa Nee Thagginpuku Samamedi

నీ అద్బుత కృపకు మితియేది

Nee Adbhutha Krupaku Mithiyedi

నీ ప్రేమకు ఇలలో సాటేది

Nee Premaku Ilalo Saatiedi

నీవంటి రక్షకుడు ఏడి – నీ లాంటి ప్రేమ ఘనుడేడి ||నీ రక్తమే||

Neevanti Rakshakudu Edi – Nee Laanti Prema Ghanudedi ||Nee Rakthame||

Related Telugu Christian Songs