లేచినాడురా సమాధి గెలిచినాడురా
Lechinaaduraa Samaadhi Gelichinaaduraa
ప|| లేచినాడురా - సమాధి గెలిచినాడురా - యేసు
Pa|| Lechinaaduraa - Samaadhi Gelichinaaduraa - Yesu
లేచినాడురా - సమాధి గెలిచినాడురా
Lechinaaduraa - Samaadhi Gelichinaaduraa
అ||ప|| లేతునని తా జెప్పినట్టు - లేఖనములలో పలికినట్లు ||లేచి||
A||Pa|| Lethunani Thaa Jeppinattu - Lekhanamulalo Palikinatlu ||Lechi||
1. భద్రముగ సమాధిపైని - పెద్దరాతిని యుంచిరి భటులు
1. Bhadramuga Samaadhipaini - Peddaraathini Yunchiri Bhatulu
ముద్రవేసి రాత్రియంత నిద్రలేక కావలియున్న ||లేచి||
Mudravesi Raathriyantha Nidraleka Kaavaliyunna ||Lechi||
2. ప్రభువు దూత పరమునుండి - త్వరగ దిగి రాతిని పొర్లించి
2. Prabhuvu Dootha Paramunundi - Thvaraga Digi Raathini Porlinchi
దానిపై కూర్చుండె - భయము నొంద కావలివారు ||లేచి||
Daanipai Koorchunde - Bhayamu Nonda Kaavalivaaru ||Lechi||
3. ప్రొద్దు పొడవకముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధములు
3. Proddu Podavakamunde Sthreelu Siddhaparachina Sugandhamulu
శ్రద్ధతోడ తెచ్చి యేసుకు - రుద్దుదామని వచ్చిచూడ ||లేచి||
Shraddhathoda Thechchi Yesuku - Ruddudaamani Vachchichooda ||Lechi||
4. చూడవెళ్ళిన స్త్రీలను దూత - చూచి యపుడే వారితోడ
4. Choodavellina Sthreelanu Dootha - Choochi Yapude Vaarithoda
లేడు గలిలయ ముందుగ పోతున్నాడు - అపుడె లేచినాడని ||లేచి||
Ledu Galilaya Munduga Pothunnaadu - Apude Lechinaadani ||Lechi||
ర్. చచ్చిపోయి లేచినాడు - స్వామిభక్తు లకగుపడినవాడు
R. Chachchipoyi Lechinaadu - Svaamibhakthu Lakagupadinavaadu
చచ్చినను నను లేపుతాడు - చావు అంటె భయపడరాదు ||లేచి||
Chachchinanu Nanu Leputhaadu - Chaavu Ante Bhayapadaraadu ||Lechi||
6. నేను చేసే పనులనెరుగు - నేను నడిచే మార్గమెరుగు
6. Nenu Chese Panulanerugu - Nenu Nadiche Maargamerugu
నేను చెప్పు మాటలెరుగు - నేనుబ్రతికే (బ్రతుకునెరుగు ||లేచి||
Nenu Cheppu Maatalerugu - Nenubrathike (Brathukunerugu ||Lechi||
7. నేను లేచిన యేసునందు - మానక మదినమ్ము కొందు - తాను
7. Nenu Lechina Yesunandu - Maanaka Madinammu Kondu - Thaanu
నాలోయుండినందున - దయను జేర్చును మోక్షమందు ||లేచి
Naaloyundinanduna - Dayanu Jerchunu Mokshamandu ||Lechi
8. పాపభారము లేదు మనకు మరణ భయము లేదు మనకు
8. Paapabhaaramu Ledu Manaku Marana Bhayamu Ledu Manaku
నరకబాధ లేదు మనకు - మరువకండి యేసుప్రభుని ||లేచి||
Narakabaadha Ledu Manaku - Maruvakandi YesuPrabhuni ||Lechi||
9. యేసునందే రక్షణభాగ్యం - యేసునందే నిత్యజీవం
9. Yesunande Rakshanabhaagyan - Yesunande Nithyajeevan
యేసునందే ఆత్మశాంతి - యేసునందే మోక్షభాగ్యం ||లేచి||
Yesunande Aathmashaanthi - Yesunande Mokshabhaagyan ||Lechi||
10. పాపులకై వచ్చినాడు - పాపులను కరుణించాడు
10. Paapulakai Vachchinaadu - Paapulanu Karuninchaadu
పాపులను (ప్రేమించానాడు - ప్రాణదానము చేసినాడు ||లేచి||
Paapulanu (Preminchaanaadu - Praanadaanamu Chesinaadu ||Lechi||