క్రీస్తుయేసుకు మంగళం

Kreesthuyesuku Mangalam

Telugu by సి. రవివర్మ • andhra-kraisthava-keerthanalu

క్రీస్తుయేసుకు మంగళం మా - కీర్తి రాజుకు మంగళం

Kreesthuyesuku Mangalam Maa - Keerthi Raajuku Mangalam

క్రీస్తుయేసే దైవమంచును - కూడి పాడుదు మంగళం

Kreesthuyese Daivamanchunu - Koodi Paadudu Mangalam

1. ప్రవచనంబులు బల్మినట్టి - ప్రాణనాధుడవీవె నీదు

1. Pravachanambulu Balminatti - Praananaadhudaveeve Needu

స్తవము జేయుచు మెలగు మనుజుల - సత్ప్రభువుకిదె మంగళం ||క్రీస్తు||

Sthavamu Jeyuchu Melagu Manujula - Sathprabhuvukide Mangalam ||Kreesthu||

2. జగమునేలెడు జీవనాధుడ - జపములందెడు కృపకటాక్ష

2. Jagamuneledu Jeevanaadhuda - Japamulandedu Krupakataaksha

అగణితంబగు ప్రేమజూపిన - అమరతేజుడ మంగళం ||క్రీస్తు||

Aganithambagu Premajoopina - Amarathejuda Mangalam ||Kreesthu||

3. ఖిలులు బ్రోచెడు కనికరాత్మ - కేంద్ర స్థానము నీ హృదయంబు

3. Khilulu Brochedu Kanikaraathma - Kendra Sthaanamu Nee Hrudayambu

కలుషమును కడమార్చినట్టి - సిలువ నాధుడ మంగళం ||క్రీస్తు||

Kalushamunu Kadamaarchinatti - Siluva Naadhuda Mangalam ||Kreesthu||

4. మనము గోరెడు మా హృదీశుడ - మార్గదర్శుడ వీవెగావ

4. Manamu Goredu Maa Hrudeeshuda - Maargadarshuda Veevegaava

అనయము నినుగొల్చు జనముల - ఆది దేవుడ మంగళం ||క్రీస్తు||

Anayamu Ninugolchu Janamula - Aadi Devuda Mangalam ||Kreesthu||

5. జనకసుత శుద్ధాత్మ దేవుడ - గనని వినని ప్రేమ పూర్ణుడ

5. Janakasutha Shuddhaathma Devuda - Ganani Vinani Prema Poornuda

తనివితీరగ పాడుదము యా - ధాత్రి నీకగు మంగళం ||క్రీస్తు||

Thanivitheeraga Paadudamu Yaa - Dhaathri Neekagu Mangalam ||Kreesthu||

Related Telugu Christian Songs