క్రీస్తునాయక నీ దయాళిని

Kreesthunaayaka Nee Dayaalini

Telugu by మిక్కిలి సమూయేలు • andhra-kraisthava-keerthanalu

క్రీస్తునాయక నీ దయాళిని - కీర్తనలుగా బాడుదున్

Kreesthunaayaka Nee Dayaalini - Keerthanalugaa Baadudun

నేస్తుతులతోయ దండ్రి దేవుని - నిత్యమును గొండాడుదున్ ||క్రీస్తు||

Nesthuthulathoya Dandri Devuni - Nithyamunu Gondaadudun ||Kreesthu||

1. సిలువ మోసిన నీ ప్రయాసను - జెప్పుటకు నోరాడదు

1. Siluva Mosina Nee Prayaasanu - Jepputaku Noraadadu

అలుకునొందక స్వామి నీ దివ్యాంఘ్రి చెంతను గూడుదు ||క్రీస్తు||

Alukunondaka Svaami Nee Divyaanghri Chenthanu Goodudu ||Kreesthu||

2. నిమిషమైన న్నాయకెదలో - నిన్ను నే స్మరియింతును

2. Nimishamaina Nnaayakedalo - Ninnu Ne Smariyinthunu

అమితమౌ దేవాను క్రోశము - హర్షముగ వర్ణింతును ||క్రీస్తు||

Amithamau Devaanu Kroshamu - Harshamuga Varninthunu ||Kreesthu||

3. యేసుప్రభు నా కాలమంతయు - నేమరక నీ నామము

3. Yesuprabhu Naa Kaalamanthayu - Nemaraka Nee Naamamu

దాసునిగ భజియింతు నింకను - దప్పకుండను నీమము ||క్రీస్తు||

Daasuniga Bhajiyinthu Ninkanu - Dappakundanu Neemamu ||Kreesthu||

4. చచ్చి నే నరుదెంచి మోక్షము - స్వామి నీ యుపకారముల్

4. Chachchi Ne Narudenchi Mokshamu - Svaami Nee Yupakaaramul

హెచ్చు ప్రేమను బాడుచుందును - యెప్పుడును గైవారముల్ ||క్రీస్తు||

Hechchu Premanu Baaduchundunu - Yeppudunu Gaivaaramul ||Kreesthu||

5. మలినమౌ నా నత్తి నాల్క సమాధిలోం గ్రశియింపను

5. Malinamau Naa Naththi Naalka Samaadhilom Grashiyimpanu

బలిమితోనే బాడుచుందును - భక్తి యుజ్వలింపను ||క్రీస్తు||

Balimithone Baaduchundunu - Bhakthi Yujvalimpanu ||Kreesthu||

6. కన్ను మూతలుగాను నీ సముఖంబు కేను బిరాలను

6. Kannu Moothalugaanu Nee Samukhambu Kenu Biraalanu

తెన్ను తప్పకవత్తు శ్రీకర - దేవ నను నీవేలను ||క్రీస్తు||

Thennu Thappakavaththu Shreekara - Deva Nanu Neevelanu ||Kreesthu||

7. ముగ్గురొకండై వెల్లుచుండెడి - మోక్షరాజ్య గరిష్టుండా

7. Muggurokandai Velluchundedi - Moksharaajya Garishtundaa

యొగ్గుచేయక నన్ను బ్రోవవే - యేసునాధ మహేశుండా ||క్రీస్తు||

Yoggucheyaka Nannu Brovave - Yesunaadha Maheshundaa ||Kreesthu||

8. భూతలములో నీ సమానము - బోల్చ నేదియు గానము

8. Bhoothalamulo Nee Samaanamu - Bolcha Nediyu Gaanamu

సలుపవే మము నీ తండ్రికిని సంధానము ||క్రీస్తు||

Salupave Mamu Nee Thandrikini Sandhaanamu ||Kreesthu||

Related Telugu Christian Songs