క్రీస్తు లేని క్రైస్తవ్యం
Kreesthu Leni Kraisthavyam
క్రీస్తు లేని క్రైస్తవ్యం ఎందుకోసము – భక్తిలేని దైవత్వం ఎవరి కోసము
Kreesthu Leni Kraisthavyan Endukosamu – Bhakthileni Daivathvan Evari Kosamu
''లోకమా నీకు శాశ్వతం – పాపమా నీకు జీవితం,,
''Lokamaa Neeku Shaashvathan – Paapamaa Neeku Jeevithan,,
గమనించు నేస్తమా ఈ నిమిషం
Gamaninchu Nesthamaa Ee Nimishan
లోకముతో స్నేహము దేవునితో వైరము
Lokamutho Snehamu Devunitho Vairamu
లోకమందు ఉన్నదంత చాలా శూన్యము
Lokamandu Unnadantha Chaalaa Shoonyamu
లోకపు ఆశ గతియించి పోవును – దేవుని చిత్తమే స్థిరముగా నిలచును
Lokapu Aasha Gathiyinchi Povunu – Devuni Chiththame Sthiramugaa Nilachunu
క్రీస్తుని ఎరిగియుంటే ఘనతకాదులే
Kreesthuni Erigiyunte Ghanathakaadule
క్రీస్తు నిన్నెరిగియుంటే ధన్యమౌనులే ||లోకమా||
Kreesthu Ninnerigiyunte Dhanyamaunule ||Lokamaa||
రేపటి దినమందు గూర్చి అతిశయించకు
Repati Dinamandu Goorchi Athishayinchaku
నేడు రేపంటు వాయిదాలు వేయకు
Nedu Repantu Vaayidaalu Veyaku
నీకన్నులకు చీకటి కమ్మకముందే – నీ గుండెలో దీపం ఆరకముందే
Neekannulaku Cheekati Kammakamunde – Nee Gundelo Deepan Aarakamunde
నీ శిరసును వంచి బ్రతుకు స్థిరము చేసుకో
Nee Shirasunu Vanchi Brathuku Sthiramu Chesuko
విరిగిన గుండెతో ప్రభుని వేడుకో ||లోకమా||
Virigina Gundetho Prabhuni Veduko ||Lokamaa||