క్రీస్తేసు సిలువపై దృష్టినుంచి
Kreesthesu Siluvapai Drushtinunchi
క్రీస్తేసు సిలువపై దృష్టినుంచి
Kreesthesu Siluvapai Drushtinunchi
ఆయన కృపయందే నిలుచుండుము
Aayana Krupayande Niluchundumu
పరలోక మహిమ కిరీటముకై
Paraloka Mahima Kireetamukai
క్రీస్తేసు అడుగులలో నడువుము (2) ||క్రీస్తేసు||
Kreesthesu Adugulalo Naduvumu (2) ||Kreesthesu||
1. సమాదాన దేశం పరలోకము
1. Samaadhaana Desham Paralokamu
ఎన్నో దీవెనలు కలవందున (2)
Enno Deevenalu Kalavanduna (2)
ఇహలోక శాంతి క్షణమాత్రమే
Ihaloka Shaanthi Kshanamaathrame
గొప్ప శిక్ష యందు దాగియుండె (2) ||క్రీస్తేసు||
Goppa Shiksha Yandu Daagiyunde (2) ||Kreesthesu||
2. క్రీస్తు నుండి నిన్ను దూర పరచ
2. Kreesthu Nundi Ninnu Doora Paracha
లోకాశలు నిన్ను ఆకర్షించు (2)
Lokaashalu Ninnu Aakarshinchu (2)
సిలువను చూడక పోయినచో
Siluvanu Choodaka Poyinacho
చిక్కుకొనెదవు ఈ లోకములో (2) ||క్రీస్తేసు||
Chikkukonedavu Ee Lokamulo (2) ||Kreesthesu||
3. ప్రభుయేసు సహవాసమున నిలిచి
3. Prabhuyesu Sahavaasamuna Nilichi
సాతానుకు స్థలమియ్యకుము (2)
Saathaanuku Sthalamiyyakumu (2)
ఏవి క్రీస్తునుండి విడదీయునో
Aevi Kreesthunundi Vidadeeyuno
యేసు రక్తమందు కడుగుకొనుము (2) ||క్రీస్తేసు||
Yesu Rakthamandu Kadugukonumu (2) ||Kreesthesu||
4. పరలోక దీవెనలు రుచి చూడను
4. Paraloka Deevenalu Ruchi Choodanu
ఆశతో వెళ్ళను సిద్ధపడు (2)
Aashatho Vellanu Siddhapadu (2)
లోకమునకు నీవు వేరైనచో
Lokamunaku Neevu Verainacho
ఆత్మీయముగ నీవు యెదిగెదవు (2) ||క్రీస్తేసు||
Aathmeeyamuga Neevu Yedigedavu (2) ||Kreesthesu||