క్రైస్తవులారా లెండి

Kraisthavulaaraa Lendi

Telugu by జాన్ బైరమ్ • andhra-kraisthava-keerthanalu

1. క్రైస్తవులారా! లెండి యీనాడు

1. Kraisthavulaaraa! Lendi Yeenaadu

క్రీస్తు పుట్టెనంచు పాడుడి;

Kreesthu Puttenanchu Paadudi;

ప్రసన్నుండైన తండ్రి ప్రేమను

Prasannundaina Thandri Premanu

ఆసక్తిపరులై కీర్తించుడి

Aasakthiparulai Keerthinchudi

క్రీస్తేను మానవాళితోడను

Kreesthenu Maanavaalithodanu

నశింపవచ్చెనంచు పాడుడి.

Nashimpavachchenanchu Paadudi.

2. దేవుని దూత గొల్లవారికి

2. Devuni Dootha Gollavaariki

ఈ రీతిగాను ప్రకటించెను:-

Ee Reethigaanu Prakatinchenu:-

'ఈ వేళ మహా సంతోషంబగు

'Ee Vela Mahaa Santhoshambagu

సువార్త నేను ఎరిగింతును.

Suvaartha Nenu Eriginthunu.

దావీదు పట్టణం దీదినము

Daaveedu Pattanan Deedinamu

దైవరక్షకుండు జన్మించెను.'

Daivarakshakundu Janminchenu.'

3. త్వరగానే ఆకాశ సైన్యము

3. Thvaragaane Aakaasha Sainyamu

హర్షించుచు నీలాగు పాడెను

Harshinchuchu Neelaagu Paadenu

'సర్వోన్న తాకాశంబునందుండు

'Sarvonna Thaakaashambunandundu

సర్వేశ్వరునికి ప్రభావము

Sarveshvaruniki Prabhaavamu

నరులయందు సమాధానము

Narulayandu Samaadhaanamu

ధరణిలో వ్యాపింపనియ్యుండు'.

Dharanilo Vyaapimpaniyyundu'.

4. పరమతండ్రి దయారసము

4. Paramathandri Dayaarasamu

నరులకెంతో నాశ్చర్యము

Narulakentho Naashcharyamu

నరావతారుండగు దేవుడు

Naraavathaarundagu Devudu

నిరపరాధిగాను జీవించి

Niraparaadhigaanu Jeevinchi

నిర్దోషమైన త్రోవ చూపించి

Nirdoshamaina Throva Choopinchi

విరోధులన్‌ ప్రేమించుచుండెను.

Virodhulan Preminchuchundenu.

5. శ్రీ మాత సైన్యముతో మేమును

5. Shree Maatha Sainyamutho Memunu

వాద్యములు వాయించుచుందుము;

Vaadyamulu Vaayinchuchundumu;

ఈ దినమందు నుద్భవించిన

Ee Dinamandu Nudbhavinchina

యా దివ్యకర్తను వీక్షింతుము;

Yaa Divyakarthanu Veekshinthumu;

సదయుండైన యేసు ప్రేమను

Sadayundaina Yesu Premanu

సదా స్తుతించి పాడుచుందుము.

Sadaa Sthuthinchi Paaduchundumu.

Related Telugu Christian Songs