కూడికొని యున్నాము
Koodikoni Yunnaamu
కూడికొని యున్నాము - సంఘ ప్రభో - కూడికొని యున్నాము = తోడ
Koodikoni Yunnaamu - Sangha Prabho - Koodikoni Yunnaamu = Thoda
నుండెద ననుచు నమ్ముచు - దొడ్డ దగు నీ పాద సన్నిధి ||కూడికొని||
Nundeda Nanuchu Nammuchu - Dodda Dagu Nee Paada Sannidhi ||Koodikoni||
1. ఎచట నా ప్రియ భక్తు - లెలమి గూడియున్న నచటికి నేనెంతు -
1. Echata Naa Priya Bhakthu - Lelami Goodiyunna Nachatiki Nenenthu -
నని పల్కితి = విచట నుండు మమ్ము - వీక్షించి కృపచేత - నిపుడు దీవించు
Nani Palkithi = Vichata Nundu Mammu - Veekshinchi Krupachetha - Nipudu Deevinchu
మా - యేసు క్రీస్తునాధా ||కూడికొని||
Maa - Yesu Kreesthunaadhaa ||Koodikoni||
2. గత కాలమందున - గాని చేతలచే దు - ర్గతి నొంది యుండగా -
2. Gatha Kaalamanduna - Gaani Chethalache Du - Rgathi Nondi Yundagaa -
గనుగొంటివి = శత సంఖ్య గల పాప - చయ మీవు క్షమియించి - యతి
Ganugontivi = Shatha Sankhya Gala Paapa - Chaya Meevu Kshamiyinchi - Yathi
శాంతి నిడితివి - యాత్మస్వరూపా ||కూడికొని||
Shaanthi Nidithivi - Yaathmasvaroopaa ||Koodikoni||
3. నిరతము నీ ప్రేమ - నెనరున ధ్యానించి - పరమ ధర్మములందు - బరత
3. Nirathamu Nee Prema - Nenaruna Dhyaaninchi - Parama Dharmamulandu - Baratha
గల్గి = యరులకు శుభములు - నిరతంబు చేయగ - దిరత మా కొసగు
Galgi = Yarulaku Shubhamulu - Nirathambu Cheyaga - Diratha Maa Kosagu
ము - దేవుని ప్రియ తనయా ||కూడికొని||
Mu - Devuni Priya Thanayaa ||Koodikoni||
4. అన్ని శోధనముల - నన్ని విపత్తుల - నన్ని కాలములందు - నాదరించి
4. Anni Shodhanamula - Nanni Vipaththula - Nanni Kaalamulandu - Naadarinchi
నిన్ను నమ్మిన జనుల - నీ సందిటను జేర్చి - పన్నుగ గాపాడు - ప్రభు
Ninnu Nammina Janula - Nee Sanditanu Jerchi - Pannuga Gaapaadu - Prabhu
యేసు క్రీస్తు ||కూడికొని||
Yesu Kreesthu ||Koodikoni||
5. అమలుండ నగు న - న్ననుకరించుం డనుచు - నాన నిచ్చినాడ - వాత్మ
5. Amalunda Nagu Na - Nnanukarinchun Danuchu - Naana Nichchinaada - Vaathma
జలకూ = నమల మార్గము నందు - నరుగంగ మాకీవు - విమలాత్మ దయ
Jalakoo = Namala Maargamu Nandu - Naruganga Maakeevu - Vimalaathma Daya
సేయు - వేగంబు మా తండ్రి ||కూడికొని||
Seyu - Vegambu Maa Thandri ||Koodikoni||