జీవితంబు ఘోర కష్టనష్టంబుల్
Jeevithambu Ghora Kashtanashtambul
1. జీవితంబు ఘోర కష్టనష్టంబుల్
1. Jeevithambu Ghora Kashtanashtambul
ఆవరించి నిన్ను దుఃఖపర్చిన
Aavarinchi Ninnu Duhkhaparchina
దేవుడిచ్చినట్టి ఈవులెంచుము
Devudichchinatti Eevulenchumu
నీ వాశ్చర్య మొందెదవు. వానికై.
Nee Vaascharya Mondedavu. Vaanikai.
||ఎంచుము లెక్కించు మీవులన్
||Enchumu Lekkinchu Meevulan
ఎంచిచూడు మేసుదీవెనల్
Enchichoodu Mesudeevenal
ఎంచు మెంచు మెంచు మీవులన్
Enchu Menchu Menchu Meevulan
వింత నొందెదవు నీవు వానికై ||
Vintha Nondedavu Neevu Vaanikai ||
2. చింతమానసంబు నీకు గల్గినన్
2. Chinthamaanasambu Neeku Galginan
వంతచే భారంబు గల్ల నీయెదన్
Vanthache Bhaarambu Galla Neeyedan
సంతసంబుతోడ నెంచుమీవులన్
Santhasambuthoda Nenchumeevulan
వింత నొందెదవు నీవు వానికై
Vintha Nondedavu Neevu Vaanikai
3. నాశనంబు జెందు నాస్తి జూడగా
3. Naashanambu Jendu Naasthi Joodagaa
వాసిగా శ్రీ యేసు నీ కొసంగిన
Vaasigaa Shree Yesu Nee Kosanggina
భాసురంపు భాగ్యముం దలంపుమా
Bhaasurampu Bhaagyamun Dalampumaa
యీ సౌభాగ్యమే గదా సదా యుండు
Yee Saubhaagyame Gadaa Sadaa Yundu
4. జీవితాదియందు ధైర్య మొందుము
4. Jeevithaadiyandu Dhairya Mondumu
దేవుడుండు నెల్లవార్కి తోడుగ
Devudundu Nellavaarki Thoduga
జీవయాత్ర యందు సాయమియ్యగన్
Jeevayaathra Yandu Saayamiyyagan
దేవదూతల్ నీకు తోడుగా నుండు.
Devadoothal Neeku Thodugaa Nundu.