ఇంత గొప్ప రక్షణ

Intha Goppa Rakshana

Telugu by అజయ్ జాషువా

ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన

Intha Goppa Rakshana Nirlakshyam Chesina

ఎలా తప్పించుకొనగలవు (2)

Elaa Thappinchukonagalavu (2)

విలువైన విమోచన అంగడిలో అమ్మిన యెడల

Viluvaina Vimochana Angadilo Ammina Yedala

త్రాసులో తూగగలవా ఆ విలువను పొందగలవా

Thraasulo Thoogagalavaa Aa Viluvanu Pondagalavaa

యుగయుగాల నిత్యజీవం

Yugayugaala Nithyajeevam

ఎన్నడైన కొనగలవా (2) ||ఇంత||

Ennadaina Konagalavaa (2) ||Intha||

1. అందమైన నీటి బుడగవా - పాల బువ్వల గడ్డిపువ్వువా

1. Andamaina Neeti Budagavaa - Paala Buvvala Gaddipuvvuvaa

క్షణికమైన ఆవిరి నీవా - అంతమయ్యే నామమే నీవా (2)

Kshanikamaina Aaviri Neevaa - Anthamayye Naamame Neevaa (2)

లోక సంద్రాన ఉప్పువు నీవు - జ్యోతిర్మయుని జీవ కాంతివి

Loka Sandraana Uppu Neevu - Jyothirmayuni Jeeva Kaanthivi

మంటి ఘటమువు కానే కావు - దేవుని మహిమైశ్వర్యము నీవు

Manti Ghatamu Kaane Kaavu - Devuni Mahimaishvaryamu Neevu

క్షయ బీజము కానే కావు - క్రయమిచ్చి కొనబడినావు

Kshaya Beejamu Kaane Kaavu - Krayamichchi Konabadinaavu

నిష్ఫలుడవు కానే కావు - నీటి ఊటల ఏదేను తోటవు ||ఇంత||

Nishphaludavu Kaane Kaavu - Neeti Ootala Edenu Thotavu ||Intha||

2. Kashta Sukhaala Aatupotuvaa Gamyamu Leni Oti Naavavaa

2. కష్ట సుఖాల ఆటుపోటువా గమ్యము లేని ఓటి నావవా

Alupu Leni Baanisa Brathukuvaa - Paapa Oobilo Bhaara Moorthivaa (2)

అలుపు లేని బానిస బ్రతుకువా - పాప ఊబిలో భార మూర్తివా (2)

Yesu Siluvalo Vijaya Geethamaa - Anantha Gnaani Nithya Darshanamaa

యేసు సిలువలో విజయ గీతమా - అనంత జ్ఞాని నిత్య దర్శనమా

Parishuddhaathma Prema Roopamaa - Kreesthu Yesuni Mahima Dehamaa

పరిశుద్ధాత్మ ప్రేమ రూపమా - క్రీస్తు యేసుని మహిమ దేహమా

Kshaya Beejamu Kaane Kaavu - Krayamichchi Konabadinaavu

క్షయ బీజము కానేకావు - క్రయమిచ్చి కొనబడినావు

Nishphaludavu Kaane Kaavu - Neeti Ootala Edenu Thotavu ||Intha||

నిష్ఫలుడవు కానేకావు - నీటిఊటల ఏదేను తోటవు ||ఇంత||

Related Telugu Christian Songs