ఇదిగో నీతిభాస్కరుండు
Idigo Neethibhaaskarundu
ఇదిగో నీతిభాస్కరుండు - ఉదయమాయె నతని నీతి హృదయ కమలమునను నిలిచి
Idigo Neethibhaaskarundu - Udayamaaye Nathani Neethi Hrudaya Kamalamunanu Nilichi
మది తమోగుణంబులణపె - సదమల జ్ఞానంబు నొసగె ||ఇదిగో||
Madi Thamogunambulanape - Sadamala Gnaanambu Nosage ||Idigo||
1. ఎవని జ్ఞానమహిమ విభవ - మెవనినీతి బలప్రకాశ
1. Evani Gnaanamahima Vibhava - Mevanineethi Balaprakaasha
మెవని మనుజ రూపమాయె - నవవినీత సత్యవర్తి
Mevani Manuja Roopamaaye - Navavineetha Sathyavarthi
రవినిమించు తేజమూర్తి ||ఇదిగో||
Raviniminchu Thejamoorthi ||Idigo||
2. నరజనముల నీతియెవడో - ధరణిపతుల దీప్తియెవడో
2. Narajanamula Neethiyevado - Dharanipathula Deepthiyevado
దురితబుణము దీర్చునెవండో - పరమపురుషు డేసుడతండె
Durithabunamu Deerchunevando - Paramapurushu Desudathande
నిరతజీవ మొసగునిపుడె ||ఇదిగో||
Nirathajeeva Mosagunipude ||Idigo||
3. కలుష మెల్ల బాపదలంచి - కలువరి గిరివరకు నడచి
3. Kalusha Mella Baapadalanchi - Kaluvari Girivaraku Nadachi
యలవికాని ముక్తి గూర్చన్ - సిలువమిద గని మరణ
Yalavikaani Mukthi Goorchan - Siluvamida Gani Marana
బలమునణలచి తిరిగిలేచె ||ఇదిగో||
Balamunanalachi Thirigileche ||Idigo||
4. మదితమం బదెచటికరిగె - యెదను కఠినతనము కరిగె
4. Madithamam Badechatikarige - Yedanu Kathinathanamu Karige
హృదయరసము లతిశయించి - సాధుగుణముగలిగి యేసు
Hrudayarasamu Lathishayinchi - Saadhugunamugaligi Yesu
పాదములను గొలుతు నిపుడె ||ఇదిగో||
Paadamulanu Goluthu Nipude ||Idigo||
5. జనగణముల జీవమతండె - ధనఘనముల దాతయతండె
5. Janaganamula Jeevamathande - Dhanaghanamula Daathayathande
యనుభవమున నెణుంగుమతని - యనుపమ ప్రేమామృతంబు
Yanubhavamuna Nenungumathani - Yanupama Premaamruthambu
ననవరతానందకరము ||ఇదిగో||
Nanavarathaanandakaramu ||Idigo||