ఘనుండైన యెహోవా

Ghanundaina Yehovaa

Telugu by విలియం డాసన్ • andhra-kraisthava-keerthanalu

ఘనుండైన యెహోవా - గద్దె ముందట మోరు

Ghanundaina Yehovaa - Gadde Mundata Moru

వినతు లిప్పుడు చేయుడి - యోజనులార

Vinathu Lippudu Cheyudi - Yojanulaara

వినయంబుగా నిర్మలానంద రసలహరి

Vinayambugaa Nirmalaananda Rasalahari

మన మనం బొప్పుచుండ - నో జనులార ||ఘనుండైన||

Mana Manan Boppuchunda - No Janulaara ||Ghanundaina||

1. ఒక్కండే మన కర్తయుండు దేవుడని యున్ - జక్కగాను సృజియించు

1. Okkande Mana Karthayundu Devudani Yun - Jakkagaanu Srujiyinchu

సంహరించు ననియున్ - నిక్కముగం దెలిసికొండీ మన సహాయమే

Sanharinchu Naniyun - Nikkamugan Delisikondee Mana Sahaayame

మక్కరలేకుండ మనల - మిక్కుటపు పరిపాలనపు బలముచేం జేసె మృత్తుచే

Makkaralekunda Manala - Mikkutapu Paripaalanapu Balamuchen Jese Mruththuche

మానవులంగ - దిక్కు గానక తిరుగు గొఱ్ఱెల వలె మనము చెదరం

Maanavulangga - Dikku Gaanaka Thirugu Gorrela Vale Manamu Chedaran

దిరుగందన దొడ్డింబెట్టె - నో జనులారా ||ఘనుండైన||

Dirugandana Doddimbette - No Janulaaraa ||Ghanundaina||

2. మే మందరము వందనపు పాటతో మూగి - మించు నీ గుమ్మములలో

2. Me Mandaramu Vandanapu Paatatho Moogi - Minchu Nee Gummamulalo

మామా స్వరము లెత్తుదుము నభము పొడవుగా - మధురలయ సహితముగను

Maamaa Svaramu Leththudumu Nabhamu Podavugaa - Madhuralaya Sahithamuganu

భూమియున్ పదివేల జిహ్వల వలం - బొందైన నీ నగరికాధామంబులను గాన

Bhoomiyun Padivela Jihvala Valan - Bondaina Nee Nagarikaadhaamambulanu Gaana

సన్నుతి వితతిపూరి - తమ్ములుగం జేయు దేవాయో జనులార ||ఘనుండైన||

Sannuthi Vithathipoori - Thammulugan Jeyu Devaayo Janulaara ||Ghanundaina||

3. ధరయంత విస్తారమైయున్నది నీ యాజ్ఞ - తగ విరహితాద్యంతమై

3. Dharayantha Visthaaramaiyunnadi Nee Yaajnya - Thaga Virahithaadyanthamai

స్థిరమైన కాలంబువలెనె యున్న దయదయ - పొరలిపోవుచు నున్నవత్సరముల్

Sthiramaina Kaalambuvalene Yunna Dayadaya - Poralipovuchu Nunnavathsaramul

నిలిచిపోయి నప్పటికిని నీదు - సత్యంబు నిలిచియుండున్ - వర శిలా ఖండ

Nilichipoyi Nappatikini Needu - Sathyambu Nilichiyundun - Vara Shilaa Khanda

పర్వతము తోడను సాటి - వన్నె కెక్కుచు నెంతయున్ ఓ జనులార ||ఘనుండైన||

Parvathamu Thodanu Saati - Vanne Kekkuchu Nenthayun O Janulaara ||Ghanundaina||

Related Telugu Christian Songs