ఘనమైన వేడుక

Ghanamaina Veduka

Telugu by ఏ ఆర్ స్టీవెన్సన్

కరుణించి కాపాడే యేసయ్యా..

Karuninchi Kaapaade Yesayyaa..

యేసయ్యా… యేసయ్యా..

Yesayyaa… Yesayyaa..

కూడుకొని మనమీవేళ

Koodukoni Manameevela

ఘనమగు వేడుకకు తెర తీయాలా (2)

Ghanamagu Vedukaku Thera Theeyaalaa (2)

గడచిన దినముల కలిగిన సుఖముకై

Gadachina Dinamula Kaligina Sukhamukai

ప్రభు యేసు ఆశీర్వాదాలకై ||కూడుకొని||

Prabhu Yesu Aasheervaadalakai ||Koodukoni||

వేసవి వడగాలుల బాధ తీరిపోయే

Vesavi Vadagaalula Baadha Theeripoye

యేసుని శుభ వాక్కుల హాయి ప్రాప్తమాయే

Yesuni Shubha Vaakkula Haayi Praapthamaaye

విదితమైన ప్రభుని ప్రేమ విడిచిపొదాయే

Vidhithamaina Prabhuni Prema Vidichipodaaye

విమలమాయే హృదయ సీమ దిగులు లేదాయే

Vimalamaaye Hrudaya Seema Digulu Ledaaye

గానమై గళమున పాడగా

Gaanamai Galamuna Paadagaa

ధ్యానమై మనసుని తాకగా

Dhyaanamai Mansuni Thaakagaa

ప్రభవించె యేసు దివ్య నాద రూపాన ||కూడుకొని||

Prabhavinche Yesu Divya Naada Roopaana ||Koodukoni||

పాతవి కడ తేరగ మనసు మారిపోయే

Paathavi Kada Theraga Manasu Maaripoye

నూతన క్రియ చేయగ దారి సిధ్ధమాయే

Noothana Kriya Cheyaga Daari Sidhdhamaaye

ప్రబలమైన సిలువ నీడ సమసిపోదాయే

Prabalamaina Siluva Needa Samasipodaaye

సమసిపోయే శ్రమల జాడ జయము నాదాయే

Samasipoye Shramala Jaada Jayamu Naadaaye

స్తోత్రమే నిలువుగ లేవగా

Sthothrame Niluvuga Levagaa

ధూపమై వరదుని చేరగా

Dhoopamai Varaduni Cheragaa

తిరిగొచ్ఛే తండ్రి శ్రేష్ఠ రూపాన ||కూడుకొని||

Thirigochche Thandri Shreshta Roopaana ||Koodukoni||

Related Telugu Christian Songs