గానము జేయుడు సుకీర్తనను

Gaanamu Jeyudu Sukeerthananu

Telugu by విలియం డాసన్ • andhra-kraisthava-keerthanalu

గానము జేయుడు సుకీర్తనను - యెహోవాను గూరిచి క్రొత్త -

Gaanamu Jeyudu Sukeerthananu - Yehovaanu Goorichi Kroththa -

గాను రక్తిగను ||గానము||

Gaanu Rakthiganu ||Gaanamu||

1. తన్నామము నుతించి యతని - రక్షక - జెన్నుగ సారె బ్రసిద్ధముగ జేసి

1. Thannaamamu Nuthinchi Yathani - Rakshaka - Jennuga Saare Brasiddhamuga Jesi

పన్నుగ నన్యులలో తన్మహిమ - యందున్నత చిత్రములను జాటండి ||గానము||

Pannuga Nanyulalo Thanmahima - Yandunnatha Chithramulanu Jaatandi ||Gaanamu||

2. ఘనతయు మహాత్మ్యమును - ద - ధ్వని యెదుటనుండు - ఘనబలమును =

2. Ghanathayu Mahaathmyamunu - Da - Dhvani Yedutanundu - Ghanabalamunu =

వినతమౌ సౌందర్యమును - న - తనివి నిర్మల స్థలమున విలసిల్లు ||గానము||

Vinathamau Saundaryamunu - Na - Thanivi Nirmala Sthalamuna Vilasillu ||Gaanamu||

3. పరిశుద్ధాలంకారముతో - నా - పరమాత్మారాధన - పరులై యుండండి =

3. Parishuddhaalankaaramutho - Naa - Paramaathmaaraadhana - Parulai Yundandi =

ధరణి సకల జనులారా - లోక - గురుని యెదుట భీతి - గోనుచు నుండండి ||గానము||

Dharani Sakala Janulaaraa - Loka - Guruni Yeduta Bheethi - Gonuchu Nundandi ||Gaanamu||

4. పరిపాలించుచున్నాడనుచు తోడి - నరులతో చెప్పుడి - ధరణి గదకుండ =

4. Paripaalinchuchunnaadanuchu Thodi - Narulatho Cheppudi - Dharani Gadakunda =

స్థిరముగ జేయు సత్యముగా - జనుల - కరిమురిగాను న్యాయము

Sthiramuga Jeyu Sathyamugaa - Janula - Karimurigaanu Nyaayamu

విమర్శించు ||గానము||

Vimarshinchu ||Gaanamu||

5. ఏమిన నా మహాత్ముండు - వచ్చు - నీ మహికి న్యాయము - నేర్పరచుటకు =

5. Emina Naa Mahaathmundu - Vachchu - Nee Mahiki Nyaayamu - Nerparachutaku =

భూమి జనులకు నీతి సత్య - ముల - తో మించు న్యాయ మెం - తో

Bhoomi Janulaku Neethi Sathya - Mula - Tho Minchu Nyaaya Men - Tho

విమర్శించు ||గానము||

Vimarshinchu ||Gaanamu||

6. జనులారా యా యెహోవాకు - మహి - మన బలమును సమర్పణము

6. Janulaaraa Yaa Yehovaaku - Mahi - Mana Balamunu Samarpanamu

జేయండి వినయముతో గానుకలను - తీసి - కొని తత్ప్రాకారమందున

Jeyandi Vinayamutho Gaanukalanu - Theesi - Koni Thathpraakaaramanduna

వసియింపండి ||గానము||

Vasiyimpandi ||Gaanamu||

Related Telugu Christian Songs