ఎటుల నీకు స్తుతులొనర్తుము
Etula Neeku Sthuthulonarthumu
ఎటుల నీకు స్తుతు లొనర్తుము - యెహోవ తనయ - యెటుల నీకు
Etula Neeku Sthuthu Lonarthumu - Yehova Thanaya - Yetula Neeku
నుతు లొనర్తుము = పటుతర పాపంబులనెడి - పంకమందుజిక్కి మదిని -
Nuthu Lonarthumu = Patuthara Paapambulanedi - Pankamandujikki Madini -
దిటముగ జెడిన మమ్ములబ్రోచి - దిక్కుజూపినట్టి యేసూ ||యెటుల||
Ditamuga Jedina Mammulabrochi - Dikkujoopinatti Yesoo ||Yetula||
1. పాపకూపమందు నుండగా బాపావిమోచ - దాపుజేర్చి కాపు
1. Paapakoopamandu Nundagaa Baapaavimocha - Daapujerchi Kaapu
జూపితి = శాపగ్రస్తులైన మా - శాపము విముక్తిజేయ - నీ పవిత్ర రక్తమే
Joopithi = Shaapagrasthulaina Maa - Shaapamu Vimukthijeya - Nee Pavithra Rakthame
నా - ప్రాపుగా నొసంగితివి ||యెటుల||
Naa - Praapugaa Nosangithivi ||Yetula||
2. భార భరితమైన యాత్మల - భారమును దీని - భూరి సౌఖ్యములతో
2. Bhaara Bharithamaina Yaathmala - Bhaaramunu Deeni - Bhoori Saukhyamulatho
నింపను = భారకుండ - ఘోరమైన శ్రమలకొంది - మరణమొంది తిరిగిలేచి
Nimpanu = Bhaarakunda - Ghoramaina Shramalakondi - Maranamondi Thirigilechi
నీవు ధాత్రి - మహిమ నొందినట్టి దేవ ||యెటుల||
Neevu Dhaathri - Mahima Nondinatti Deva ||Yetula||
3. నీతిహీనులమై యుండగా - నో కర్త మాదు - భీతులన్నిబాపి నీ కృపన్
3. Neethiheenulamai Yundagaa - No Kartha Maadu - Bheethulannibaapi Nee Krupan
= నీతి రక్షణవస్త్రములను - భాతిగ ధరింపజేసి - భూతలంబునందు నిన్ను -
= Neethi Rakshanavasthramulanu - Bhaathiga Dharimpajesi - Bhoothalambunandu Ninnu -
ఖ్యాతిగ సేవింపజేసితి ||యెటుల||
Khyaathiga Sevimpajesithi ||Yetula||
4. నిన్నుజేరి నిర్భయుండనై - యా భూమియందు - నిన్ను బోలి
4. Ninnujeri Nirbhayundanai - Yaa Bhoomiyandu - Ninnu Boli
నడుచుకొనుటకై = తిన్నని మార్గమును జూపి - అన్ని కీడులను జయింప -
Naduchukonutakai = Thinnani Maargamunu Joopi - Anni Keedulanu Jayimpa -
బన్నుగ విమలాత్మశక్తి - నున్నతముగ నిడిన యేసూ ||యెటుల||
Bannuga Vimalaathmashakthi - Nunnathamuga Nidina Yesoo ||Yetula||
5. పరమ రాజ్యమందు నిరతము - నీతోనుండ - కరుణతోడ నెంచుకొంటివి
5. Parama Raajyamandu Nirathamu - Neethonunda - Karunathoda Nenchukontivi
= తిరిగి వచ్చి మమ్మును మీ - చిరప్రకాశ పురమునందు - త్వరగ
= Thirigi Vachchi Mammunu Mee - Chiraprakaasha Puramunandu - Thvaraga
జేర్చియందు సుఖము - దిరముగా నొసంగదేవ ||యెటుల||
Jerchiyandu Sukhamu - Diramugaa Nosangadeva ||Yetula||