ఎరిగి ఎరిగి చెడిపోతివి

Erigi Erigi Chedipothivi

Telugu by పురుషోత్తము చౌదరి • andhra-kraisthava-keerthanalu

ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా

Erigi Erigi Chedipothivi Manasaa

యిక నీ దిక్కెవ్వరు చెపుమా (2)

Yika Nee Dikkevvaru Chepumaa (2)

దురితం బిది స - చ్చరితం బిది యని

Duritham Bidi Sa - Chcharitham Bidi Yani

యెరుక సరకు గొన - కేమియు నీ ॥ఎరిగి॥

Yeruka Saraku Gona - Kemiyu Nee ||Erigi||

1. ఆది దేవుని దయ యిది క్రీస్తుని ప్రియ

1. Aadi Devuni Daya Yidi Kreesthuni Priya

మిది విమలాత్ముని గుణ మనుచు (2)

Midi Vimalaathmuni Guna Manuchu (2)

ఎదలో ననుభవ - మెరిగి మరల దు

Yedalo Nanubhava - Merigi Marala Du

ర్మదమున దుష్కృత - పదమున బడితివి ॥ఎరిగి॥

Rmadamuna Dushkrutha - Padamuna Badithivi ||Erigi||

2. సకలము జూచెడు దేవుని కంటికి

2. Sakalamu Joochedu Devuni Kantiki

జాటుగ జరిగెడి పని యేది (2)

Jaatuga Jarigedi Pani Yedi (2)

ఇక జెవి గుసగుస - లెల్లను దిక్కుల

Yika Jevi Gusagusa - Lellanu Dikkula

బ్రకటము జేసెడు-ప్రభు వున్నాడని ॥ఎరిగి॥

Brakatamu Jesedu - Prabhu Vunnaadani ||Erigi||

3. ఎన్నిమార్లు సిలువను వేయుచు

3. Enni Maarlu Siluvanu Veyuchu

ప్రభు యేసుని వెతబడ జేసెదవు (2)

Prabhu Yesuni Vethabada Jesedavu (2)

తిన్నని మార్గము - తెలిసియుండి నీ

Thinnani Maargamu - Thelisiyundi Nee

కన్నుల గంతలు - గట్టితి వయ్యో ॥ఎరిగి॥

Kannula Ganthalu - Gattithi Vayyo ||Erigi||

4. గద్దించెడు మనస్సాక్షికి గడ

4. Gadhinchedu Manassaakshiki Gada

గడ లాడక పోతివి నీవు (2)

Gada Laadaka Pothivi Neevu (2)

హద్దు మీరి దై-వాజ్ఞలు ద్రోయుచు

Haddu Meeri Dai - Vaagnalu Droyuchu

నెద్దు లాగు పరు - గెత్తితి వయ్యో ॥ఎరిగి॥

Neddu Laagu Paru - Getthithi Vayyo ||Erigi||

5. పలువిధ శోధన బాధలలో ఘన

5. Paluvidha Shodhana Baadhalalo Ghana

ప్రభు క్రీస్తుడె నీ దిక్కునుకో (2)

Prabhu Kreesthude Nee Dikkunuko (2)

తాళుచు బశ్చాత్తాపము పడి యిక

Thaaluchu Bashchaaththaapamu Padi Yika

జాలించుము కలు - షపు యత్నంబు ॥ఎరిగి॥

Jaalinchumu Kalu - Shapu Yathnambu ||Erigi||

6. అపరిమిత దయా శాంతులు గల ప్రభు

6. Aparimitha Dayaa Shaanthulu Gala Prabhu

వనిశము కోపింపండు నీపై (2)

Vanishamu Kopimpandu Neepai (2)

కృపా వాగ్ధద్తము - లెపుడు దలంచి నీ

Krupaa Vaagdaththamu - Lepudu Dalanchi Nee

యపవిత్రతం గని - హా యని యేడ్వుము ॥ఎరిగి॥

Yapavithrathan Gani - Haa Yani Yedvumu ||Erigi||

Related Telugu Christian Songs