ఎంతో ఘనమగువారలు
Entho Ghanamaguvaaralu
ఎంతో ఘనమగువారలు - పరిశుద్ధులు - ఎంతో వినదగువారలు =
Entho Ghanamaguvaaralu - Parishuddhulu - Entho Vinadaguvaaralu =
సంతసంబుగ వార -త్యంత ప్రేరణతోడ - సొంతవారిని సహా - సొంతంబుగ
Santhasambuga Vaara -Thyantha Preranathoda - Sonthavaarini Sahaa - Sonthambuga
విడచి = చెంతజేరిరి యేసు ప్రభుని - చింతలేకను వెంబడించి - వింత
Vidachi = Chenthajeriri Yesu Prabhuni - Chinthalekanu Vembadinchi - Vintha
పనులను జేసి బ్రతికిరి - అంతమువరకును నడచిరి ||ఎంతో||
Panulanu Jesi Brathikiri - Anthamuvarakunu Nadachiri ||Entho||
1. పేతు రపోస్తలుండు - అతని సోదరు - డతి ప్రియు డందెయయు = నీతి
1. Pethu Raposthalundu - Athani Sodaru - Dathi Priyu Dandeyayu = Neethi
నియమములందు - ప్రీతితో బ్రదుకుచు - చేతి పనులయందు - శ్రద్ధతో
Niyamamulandu - Preethitho Bradukuchu - Chethi Panulayandu - Shraddhatho
నుండుచు = ఖ్యాతి నొందిన యోహాను - అతని యన్న యాకోబుతోను - ప్రతి
Nunduchu = Khyaathi Nondina Yohaanu - Athani Yanna Yaakobuthonu - Prathi
దినంబును కలిసి యుండుచు - భక్తి ప్రభువును వెంబడించిరి ||ఎంతో||
Dinambunu Kalisi Yunduchu - Bhakthi Prabhuvunu Vembadinchiri ||Entho||
2. ఆస్తి నిచ్చిన బర్నబా - ఆస్తిపరుడ - పోసలులతో జేరెన్ = స్వస్థబుద్ధి తోడ
2. Aasthi Nichchina Barnabaa - Aasthiparuda - Posalulatho Jeren = Svasthabuddhi Thoda
- ఆస్తివాడుట యెట్లో - క్రీస్తు సేవకొరకు - ఖర్చుపెట్టుట యెట్లో = వాస్తవముగ
- Aasthivaaduta Yetlo - Kreesthu Sevakoraku - Kharchupettuta Yetlo = Vaasthavamuga
నేర్పినాడు - ఆస్తిగలవారలకు నెల్ల - ప్రస్తుతంపు ఆస్తిపాస్తులు - ప్రభువు
Nerpinaadu - Aasthigalavaaralaku Nella - Prasthuthampu Aasthipaasthulu - Prabhuvu
పనికియ్యవలెనని ||ఎంతో||
Panikiyyavalenani ||Entho||
3. సంఘమును హింసించిన - సంఘాభిమాని - సంఘ నాయకుడు పౌలు =
3. Sangghamunu Hinsinchina - Sangghaabhimaani - Sanggha Naayakudu Paulu =
సంఘముల నెన్నిటినో - చక్కగను స్థాపించి - సంఘముల కుత్తరముల్ -
Sangghamula Nennitino - Chakkaganu Sthaapinchi - Sangghamula Kuththaramul -
సమయానుకులముగ = సంఘ కాపరులకును సహా - సరియగు సలహాల
Samayaanukulamuga = Sanggha Kaaparulakunu Sahaa - Sariyagu Salahaala
నిచ్చి- సంఘములను ప్రభువు కొరకై స్థాపించి నిలుపలేదా ||ఎంతో||
Nichchi- Sangghamulanu Prabhuvu Korakai Sthaapinchi Nilupaledaa ||Entho||
4. కన్యయైన మరియమ్మ - ధన్యురాలు - కన్యలకు తల్లులకున్ను = అన్యులకు
4. Kanyayaina Mariyamma - Dhanyuraalu - Kanyalaku Thallulakunnu = Anyulaku
అందరికి - ఆదర్శముగ నుండ - సన్యాసిను లెందరో -స్వామిని సేవించ =
Andariki - Aadarshamuga Nunda - Sanyaasinu Lendaro -Svaamini Sevincha =
కన్యకలుగ నిలుచువారలు - కఠినవ్రతములతోడ నుండి - ధన్యులగు
Kanyakaluga Niluchuvaaralu - Kathinavrathamulathoda Nundi - Dhanyulagu
పరిశుద్ధులతో - దైవసన్నిధి నుండ జూపెను ||ఎంతో||
Parishuddhulatho - Daivasannidhi Nunda Joopenu ||Entho||
5. మగదాలయూరి మరియ - మహినినున్న - మగువలలో కెల్లను = భగవంతుడై
5. Magadaalayoori Mariya - Mahininunna - Maguvalalo Kellanu = Bhagavanthudai
నట్టి - ప్రభువు యేసునుజేరి - నగము నెక్కెను తన - సొగసైన మార్పుచే =
Natti - Prabhuvu Yesunujeri - Nagamu Nekkenu Thana - Sogasaina Maarpuche =
సాగి మొదట సమాధికడకు - స్వామిదర్శనమొంది మొదట- వేగవెళ్లి శిష్యులకును
Saagi Modata Samaadhikadaku - Svaamidarshanamondi Modata- Vegavelli Shishyulakunu
- వెదకి సాక్ష్యమియ్యలేదా ||ఎంతో||
- Vedaki Saakshyamiyyaledaa ||Entho||
6. మత్తయి మార్కులను వారు - మతమునందు - అతినిష్టగలవారలు = మత్తయి
6. Maththayi Maarkulanu Vaaru - Mathamunandu - Athinishtagalavaaralu = Maththayi
యూదులకై తన పుస్తకమును వ్రాసె - మార్కు గూడను తన సు-వార్తనందరి
Yoodulakai Thana Pusthakamunu Vraase - Maarku Goodanu Thana Su-Vaarthanandari
కిచ్చె = వాస్తవంపు జీవితమును - వరుసగాను గలిగియుండ - క్రీస్తు ప్రభువును
Kichche = Vaasthavampu Jeevithamunu - Varusagaanu Galigiyunda - Kreesthu Prabhuvunu
వెంబడించగ - క్రొత్తలోకము జూపగలిగిరి ||ఎంతో||
Vembadinchaga - Kroththalokamu Joopagaligiri ||Entho||
7. చూచననేగాని- నమ్మనని - పేచిపెట్టి నతోమయు = చాచి చేయి చూచి
7. Choochananegaani- Nammanani - Pechipetti Nathomayu = Chaachi Cheyi Choochi
చక్కగ నమ్మెను - చూడకుండనె లూక - వైద్యుండు నమ్మెను = యీ చొప్పున
Chakkaga Nammenu - Choodakundane Looka - Vaidyundu Nammenu = Yee Choppuna
వీరలిద్దరు - నీచజనులకెల్లరకు తము - బ్రోచు ప్రభువును జూపుచుందురు -
Veeraliddaru - Neechajanulakellaraku Thamu - Brochu Prabhuvunu Joopuchunduru -
బ్రోదిగా ప్రతిదినమునందును ||ఎంతో||
Brodigaa Prathidinamunandunu ||Entho||
8. ప్రభువా నీ పరిశుద్ధుల - బ్రతుకునందు - మా భాగ్యమునున్నదిహో =
8. Prabhuvaa Nee Parishuddhula - Brathukunandu - Maa Bhaagyamununnadiho =
ప్రభువా వారి బ్రదుకు - ప్రబలమైన సేవ - విభవంగాగని - విజయంబు
Prabhuvaa Vaari Braduku - Prabalamaina Seva - Vibhavanggaagani - Vijayambu
గాంచుచు = సభను యే రాణింపజేసి - సఫలముగ సేవించి బ్రతికి -
Gaanchuchu = Sabhanu Ye Raanimpajesi - Saphalamuga Sevinchi Brathiki -
ప్రభువ వారితో నేలునట్లు - యభయమియ్యు మాకు దేవా ||ఎంతో||
Prabhuva Vaaritho Nelunatlu - Yabhayamiyyu Maaku Devaa ||Entho||