ఎంతదూరము మోయించెదరు స్వామి
Enthadooramu Moyinchedaru Svaami
ప|| ఎంతదూరము మోయించెదరు స్వామి
Pa|| Enthadooramu Moyinchedaru Svaami
కింత సిలువనెత్తి నుంతైన దయేలక ||ఎంత||
Kintha Siluvaneththi Nunthaina Dayelaka ||Entha||
1. ఒంటిగా ప్రార్థించి యుపవాసములు జేసి
1. Ontigaa Praarthinchi Yupavaasamulu Jesi
కంటి నిదురలేక కలతజెందిన ప్రభుని ||ఎంత||
Kanti Niduraleka Kalathajendina Prabhuni ||Entha||
2. సొమ్మునాశించి గురున్ అమ్ముకొన్న యూద
2. Sommunaashinchi Gurun Ammukonna Yooda
నమ్మించి మీకిచ్చె నిమ్మానుయేలును ||ఎంత||
Namminchi Meekichche Nimmaanuyelunu ||Entha||
3. కరములు జోడించి కడకు గేత్సెమనిలో
3. Karamulu Jodinchi Kadaku Gethsemanilo
పరమ తండ్రిని వేడు నిరపరాదిని పట్టి ||వెంత||
Parama Thandrini Vedu Niraparaadini Patti ||Ventha||
4. పిరికి పిలాతుని బెదరించి యదలించి
4. Piriki Pilaathuni Bedarinchi Yadalinchi
యెరుషాలేం వీధుల నేసుని ద్రిప్పుచు ||ఎంత||
Yerushaalen Veedhula Nesuni Drippuchu ||Entha||
5. ఒడలలసి నా ప్రభువు తడబడుచుండగా
5. Odalalasi Naa Prabhuvu Thadabaduchundagaa
ఘడియ ఘడియకు తిట్టి గట్టిగ కొట్టుచు ||వంత||
Ghadiya Ghadiyaku Thitti Gattiga Kottuchu ||Vantha||
6. కలువరి గిరివరకు సిలువ మోయలేక
6. Kaluvari Girivaraku Siluva Moyaleka
అలసిన ప్రభుజంప నాలస్యమును చేసి ||ఎంత||
Alasina Prabhujampa Naalasyamunu Chesi ||Entha||
7. యేసు నీకొరకై నే నేడ్చుటకంటెను
7. Yesu Neekorakai Ne Nedchutakantenu
దోషినని గ్రహించి దోసిలొగ్గుటె మేలు ||వంత||
Doshinani Grahinchi Dosiloggute Melu ||Vantha||