ఎంత ప్రేమించెనో

Entha Premincheno

Telugu by చదలవాడ జకర్యా • andhra-kraisthava-keerthanalu

ఎంత ప్రేమించెనో - దేవుండు మనపై - నెంతదయంజూపెనో

Entha Premincheno - Devundu Manapai - Nenthadayanjoopeno

వింతగల యీ దైవప్రేమను - సాంతమున ధ్యానింపరే ||ఎంత||

Vinthagala Yee Daivapremanu - Saanthamuna Dhyaanimpare ||Entha||

1. పనికిమాలిన పాపాత్ములమైన మనము ఆ - ఘనదేవునికి పిల్లలమనబడుటకై

1. Panikimaalina Paapaathmulamaina Manamu Aa - Ghanadevuniki Pillalamanabadutakai

తన కుమారుని మరణ బలిరక్తమున మన - లను స్వీకరించుకొనెను దీనిని జూడరే ||ఎంత||

Thana Kumaaruni Marana Balirakthamuna Mana - Lanu Sveekarinchukonenu Deenini Joodare ||Entha||

2. పెంటకుప్పమోంద పడియున్న యీ నీచ - మంటి పురుగులను లేవనెత్తి

2. Pentakuppamonda Padiyunna Yee Neecha - Manti Purugulanu Levaneththi

మింటిపై ఘనులతోం గూర్చుండంజేయ నీ - మంటి కేతెంచె మన వంటి

Mintipai Ghanulathon Goorchundanjeya Nee - Manti Kethenche Mana Vanti

దేహము దాల్చి ||ఎంత||

Dehamu Daalchi ||Entha||

3. ద్రాక్షారసపు మధురమును మించి యీ ప్రేమ - సాక్షాత్తుగా మనపయినుండగా

3. Draakshaarasapu Madhuramunu Minchi Yee Prema - Saakshaaththugaa Manapayinundagaa

ఈ క్షితినా ప్రేమ ద్రాక్షారసముకంటె - దీక్షగవేడి యపేక్షింపతగునాహా ||ఎంత||

Ee Kshithinaa Prema Draakshaarasamukante - Deekshagavedi Yapekshimpathagunaahaa ||Entha||

4. మనలను ప్రేమించి తన ప్రాణమిచ్చిన - ఘనుండా కాశమునుండి మరలి వచ్చి

4. Manalanu Preminchi Thana Praanamichchina - Ghanundaa Kaashamunundi Marali Vachchi

మన దైన్యదేహమును తనరూపముకు మార్చి - కొనిపోయి తన రాజ్యమును మనకీయును ||ఎంత||

Mana Dainyadehamunu Thanaroopamuku Maarchi - Konipoyi Thana Raajyamunu Manakeeyunu ||Entha||

5. గట్టిగ మనమునం దిట్టి నిరీక్షణ - పెట్టియున్న సత్ క్రైస్తవులూ

5. Gattiga Manamunan Ditti Nireekshana - Pettiyunna Sath Kraisthavuloo

డెట్టివాండొ మనమునట్టి వారుగ ప్రభుని - కట్టడలను మదిని బెట్టియుందము వేడ్క ||ఎంత||

Dettivaando Manamunatti Vaaruga Prabhuni - Kattadalanu Madini Bettiyundamu Vedka ||Entha||

Related Telugu Christian Songs