ఎన్నో మేళ్ళను నీవు చేశావులే
Enno Mellanu Neevu
ఎన్నో మేళ్ళను నీవు చేశావులే ఎంతోవేదన తొలగించావులే
Enno Mellanu Neevu Cheshaavule Enthovedana Tholaginchaavule
నేనేమి చేయగలను నీకెమి ఇవ్వగలను సర్వస్వం నీదే
Nenemi Cheyagalanu Neekemi Ivvagalanu Sarvasvam Neede
1. నీతి గలదేవా నాయేసురాజా
1. Neethi Galadevaa Naayesuraajaa
న్యాయమగు దృష్టితో చూచునాధా
Nyaayamagu Drushtitho Choochunaadhaa
నీదు దర్శనము కలిగించినావు
Needu Darshanamu Kaliginchinaavu
నాకు రక్షణను చూపించినావు (నేనేమి)
Naaku Rakshananu Choopinchinaavu (Nenemi)
2. కష్టకాలమున నినుచేరినాను
2. Kashtakaalamuna Ninucherinaanu
కనికరము చూపుమని కోరినాను
Kanikaramu Choopumani Korinaanu
కలవరముతోను నినువేడినాను
Kalavaramuthonu Ninuvedinaanu
కరుణతో నీవు మాట్లాడినావు (నేనేమి)
Karunatho Neevu Maatlaadinaavu (Nenemi)
3. ప్రార్ధనకు నీవు చెవియొగ్గినావు
3. Praardhanaku Neevu Cheviyogginaavu
ప్రతిఫలము నాకు దయచేసినావు
Prathiphalamu Naaku Dayachesinaavu
నీ రెక్కలక్రింద నను దాచినావు
Nee Rekkalakrinda Nanu Daachinaavu
కంటిపాపలా ననుకాచినావు (నేనేమి)
Kantipaapalaa Nanukaachinaavu (Nenemi)
4. దుష్టుని నుండి రక్షించినావు
4. Dushtuni Nundi Rakshinchinaavu
శత్రువు నుండి కాపాడినావు
Shathruvu Nundi Kaapaadinaavu
లోకము నుండి విడిపించినావు
Lokamu Nundi Vidipinchinaavu
తృప్తితో నీవు ననునింపినావు (నేనేమి)
Thrupthitho Neevu Nanunimpinaavu (Nenemi)
5. నీదు శక్తిని పంపించినావు
5. Needu Shakthini Pampinchinaavu
నాదు బాహువులు బలపరచినావు
Naadu Baahuvulu Balaparachinaavu
ఆత్మదీపమును వెలిగించినావు
Aathmadeepamunu Veliginchinaavu
ఆత్మతో నన్ను నడిపించినావు (నేనేమి)
Aathmatho Nannu Nadipinchinaavu (Nenemi)