ఏమి నేను సమర్పింతు
Emi Nenu Samarpinthu
ఏమి నేను సమర్పింతు - యేసూ - యెట్లు నిన్ను స్తుతియింతు
Emi Nenu Samarpinthu - Yesoo - Yetlu Ninnu Sthuthiyinthu
ఏమి సమర్పింతు - హీనుండ నగు నేను - గామితార్థము లెల్ల
Emi Samarpinthu - Heenunda Nagu Nenu - Gaamithaarthamu Lella
గలుగంజేయు నీకు ||ఏమి||
Galuganjeyu Neeku ||Emi||
1. నేను మార్గముం దప్పియుండంగ - నన్ను - నీవు కంటివి కరుణ నిండంగ
1. Nenu Maargamum Dappiyundanga - Nannu - Neevu Kantivi Karuna Nindanga
దీనపాపులను - దృఢముగం బ్రోవను - దాన మిచ్చితివి - తనర నీ ప్రాణము ||ఏమి||
Deenapaapulanu - Drudhamugam Brovanu - Daana Michchithivi - Thanara Nee Praanamu ||Emi||
2. అందరి కొరకీవు తెచ్చిన - మిగుల - అందమైన నిత్య రక్షణ
2. Andari Korakeevu Thechchina - Migula - Andamaina Nithya Rakshana
అంది నిన్ను వినతి - పొందుగం జేసెద - నొందుమా నా నుతి
Andi Ninnu Vinathi - Pondugam Jeseda - Nondumaa Naa Nuthi
నుత్తమ ప్రభు క్రీస్తు ||ఏమి||
Nuththama Prabhu Kreesthu ||Emi||
3. నీ యందే యానంద మొందంగ - యేసు - నీదైన యాత్మ నాకందంగ
3. Nee Yande Yaananda Mondanga - Yesu - Needaina Yaathma Naakandanga
జేయు మంచు నీకు జేసెదం ప్రార్థన - నాయందు దయచేసి
Jeyu Manchu Neeku Jesedam Praarthana - Naayandu Dayachesi
నా మనవి నాలించు ||ఏమి||
Naa Manavi Naalinchu ||Emi||
4. నేను జేసిన యఘము లెన్ను - కర్త - నీ యెదుట దలంచుకొందును
4. Nenu Jesina Yaghamu Lennu - Kartha - Nee Yeduta Dalanchukondunu
నేను సిగ్గు నొంది - నిజముగం గుందుచు - నేను వేండుకొందు
Nenu Siggu Nondi - Nijamugam Gunduchu - Nenu Vendukondu
నీ క్షమాపణ కొరకు ||ఏమి||
Nee Kshamaapana Koraku ||Emi||
5. నన్ను నీవు స్థిరపరచుము - కర్త - యన్నిట నను బలపరుచుము
5. Nannu Neevu Sthiraparachumu - Kartha - Yannita Nanu Balaparuchumu
తిన్నని మార్గమున - దృఢముగ నేగుచు - నిన్ను నే స్తుతియింతు
Thinnani Maargamuna - Drudhamuga Neguchu - Ninnu Ne Sthuthiyinthu
నిండుగ నెల్లప్పుడు ||ఏమి||
Ninduga Nellappudu ||Emi||