దొరుకుతావురా సహోదరా

Dorukuthaavuraa Sahodaraa

Telugu • andhra-kraisthava-keerthanalu

దొరుకుతావురా సహోదరా! దొరుకుతావురా; నీవు

Dorukuthaavuraa Sahodaraa! Dorukuthaavuraa; Neevu

తరిమి తరిమి కీడుచేయ - పరుగులెత్తినగాని తుదకు

Tharimi Tharimi Keeducheya - Paruguleththinagaani Thudaku

1. చిన్న చూపు చూచి తమ్ముని- కన్నెటుంగక చంపినగాని

1. Chinna Choopu Choochi Thammuni- Kannetunggaka Champinagaani

అన్న కయీను దేవుని - హస్తమునకు దొరికిన రీతిగా ||దొ||

Anna Kayeenu Devuni - Hasthamunaku Dorikina Reethigaa ||Do||

2. వరములొందిన తమ్ముని - జంప-వలయునని పంతముగబట్టి

2. Varamulondina Thammuni - Jampa-Valayunani Panthamugabatti

నరకవచ్చిలోబడి యేడ్చిన - దురిత చరితుని యేశావువలె ||దొ||

Narakavachchilobadi Yedchina - Duritha Charithuni Yeshaavuvale ||Do||

3. భక్త దావీదును బట్టి - ప్రాణము దీయగ దలచిన తన

3. Bhaktha Daaveedunu Batti - Praanamu Deeyaga Dalachina Thana

శక్తితో తరిమిన రాజగు -సౌలు దొరికినరీతిగాను

Shakthitho Tharimina Raajagu -Saulu Dorikinareethigaanu

4. విగ్రహమునకు మొక్కని - పిల్లల నగ్నిలోపడవైచి

4. Vigrahamunaku Mokkani - Pillala Nagnilopadavaichi

ఆగ్రహించిన నెబుకద్నెజరు - గడ్జిమేసి దొరికిన విధముగ ||దొ||

Aagrahinchina Nebukadnejaru - Gadjimesi Dorikina Vidhamuga ||Do||

5. క్రైస్తవులను బట్టి కొట్టి - వేయదలచినను

5. Kraisthavulanu Batti Kotti - Veyadalachinanu

వాస్తవమగు వెలుగును జూచి -ప్రభుని చాటిని పౌలుబోలి ||దొ||

Vaasthavamagu Velugunu Joochi -Prabhuni Chaatini Pauluboli ||Do||

6. కీడుచేయబోకు మెపుడు - కీడు నీకే కీడు కీడు

6. Keeducheyaboku Mepudu - Keedu Neeke Keedu Keedu

కీడు చేసినమేలుచేసి - కీడును జయింపకపోతే

Keedu Chesinameluchesi - Keedunu Jayimpakapothe

7. మాటలు కుదిరితే మాటలు - కోటలు కుదురును నీకు

7. Maatalu Kudirithe Maatalu - Kotalu Kudurunu Neeku

మాటలలో లోటుంటే - నోటిమాట తప్పకుండ ||దొ||

Maatalalo Lotunte - Notimaata Thappakunda ||Do||

8. దొంగతనము వ్యభిచారమునకు - లొంగి శాపగ్రస్తులునై

8. Donggathanamu Vyabhichaaramunaku - Longgi Shaapagrasthulunai

దొంగిలించిన దశమభాగమే - లొంగుట కారణమని తుదకు

Donggilinchina Dashamabhaagame - Longguta Kaaranamani Thudaku

9. కొంతయిచ్చిన దశమభాగ - మంత యిదియని తప్పుకున్న

9. Konthayichchina Dashamabhaaga - Mantha Yidiyani Thappukunna

కొంతయిచ్చిన కయీనువలె - కొంతయిచ్చిన అననియవలె ||దొ||

Konthayichchina Kayeenuvale - Konthayichchina Ananiyavale ||Do||

10. చెడుగుచేసి బదులు దానిని - చేసినారని చెప్పమన్న వడిగ

10. Cheduguchesi Badulu Daanini - Chesinaarani Cheppamanna Vadiga

దేవుని న్యాయమనెడి - పరమత్రాసులో నిలువండి ||దొ||

Devuni Nyaayamanedi - Paramathraasulo Niluvandi ||Do||

Related Telugu Christian Songs