దినము గతియించెను

Dinamu Gathiyinchenu

Telugu by దానరి మోజెస్ • andhra-kraisthava-keerthanalu

దినము గతియించెను - దిననాథుండు పరాద్రి - వెనుకడాంగా గె

Dinamu Gathiyinchenu - Dinanaathundu Paraadri - Venukadaanggaa Ge

నింకమా - మునిమాపు సంస్తవముం గొనుము సంప్రీతిమై - ఘనుండ దేవా ||దినము||

Ningkamaa - Munimaapu Sansthavamun Gonumu Sampreethimai - Ghanunda Devaa ||Dinamu||

1. సరవినంబరవీధి - సంజ కెంజాయలు - మురువుంజూపె - ప్రభువా

1. Saravinambaraveedhi - Sanja Kenjaayalu - Muruvunjoope - Prabhuvaa

దొరము నీ ముఖకాంతి - కిరణ జాలము మాపై - నెలపరమ్ము ||దినము||

Doramu Nee Mukhakaanthi - Kirana Jaalamu Maapai - Nelaparammu ||Dinamu||

2. కటికి చీకటులు ది - క్కటములం గలిపియు - తృటములైన - నీ చెం

2. Katiki Cheekatulu Di - Kkatamulan Galipiyu - Thrutamulaina - Nee Chen

గట నున్న నెట్టి సం - కటమేని మమ్ముం - దాకుటకు జంకు ||దినము||

Gata Nunna Netti San - Katameni Mammun - Daakutaku Jangku ||Dinamu||

3. తలంపువలనను నోటి - పలుకువలనను జెనంటి - పనులవల్ల - మేము

3. Thalampuvalananu Noti - Palukuvalananu Jenanti - Panulavalla - Memu

వలచి చేసిన పాప - ముల నెల్ల క్షమియింపు - మ లఘుక్షాంతి ||దినము||

Valachi Chesina Paapa - Mula Nella Kshamiyimpu - Ma Laghukshaanthi ||Dinamu||

4. ముమ్మరమ్మగు శోధ - నమ్ములపై విజ - యమ్మునొంద - నీది నమ్ము

4. Mummarammagu Shodha - Nammulapai Vija - Yammunonda - Needi Nammu

మాకు సామ - ర్థ్య మొసంగితివి వంద - నమ్ము దేవ ||దినము||

Maaku Saama - Rthya Mosanggithivi Vanda - Nammu Deva ||Dinamu||

5. ఈ దినము మాకు స - మ్మోదంబుతో నిచ్చి - యాదుకొన్న - వరమౌ

5. Ee Dinamu Maaku Sa - Mmodambutho Nichchi - Yaadukonna - Varamau

నీ దివ్యదానముల - కై దేవా మా కృతజ్ఞతను గొమ్ము ||దినము||

Nee Divyadaanamula - Kai Devaa Maa Kruthagnathanu Gommu ||Dinamu||

6. అలసిన మా దేహ - ములకు వలసిన నిదురం - గలుగంజేసి - నీదూ

6. Alasina Maa Deha - Mulaku Valasina Niduran - Galuganjesi - Needoo

తల హస్తములలో మ - మ్ములను దాంచుము భద్ర - ముగను దేవ ||దినము||

Thala Hasthamulalo Ma - Mmulanu Daanchumu Bhadra - Muganu Deva ||Dinamu||

7. అరుణోదయమునని - న్నర్చించు కొరకు నీ - కరము సాంచి - మమ్ము

7. Arunodayamunani - Nnarchinchu Koraku Nee - Karamu Saanchi - Mammu

త్వరగా మేల్కొల్చుము - స్వాస్థ్య ప్రదాతవై - పరమదేవ ||దినము||

Thvaragaa Melkolchumu - Svaasthya Pradaathavai - Paramadeva ||Dinamu||

8. దాత వీవె లోక - త్రాత వీవె మాకు - నేత వీవె - యేసు

8. Daatha Veeve Loka - Thraatha Veeve Maaku - Netha Veeve - Yesu

నీతి సూర్యుండవి - ఖ్యాతి మహిమలు నీకె - కలుగుంగాక ||దినము||

Neethi Sooryundavi - Khyaathi Mahimalu Neeke - Kalugunggaaka ||Dinamu||

Related Telugu Christian Songs