దేవునితో సహపాటి

Devunitho Sahapaati Paalivaarigaanujese

Telugu by సీయోను గీతాలు

దేవునితో సహపాటి

Devunitho Sahapaati

పాలివారిగాను జేసె (2)

Paalivaarigaanu Jese (2)

తోడివారసులనుగా

Thodivaarasulanugaa

మనలను ప్రభు జేసెనుగా (2) ||దేవునితో||

Manalanu Prabhu Jesenugaa (2) ||Devunitho||

1. దుష్టలోకము నుండి

1. Dushtalokamu Nundi

అద్భుతముగా రక్షించె (2)

Adbhuthamugaa Rakshinche (2)

అమూల్య వాగ్దానములిచ్చి

Amoolya Vaagdaanamulichchi

దైవ స్వభావ మొసగెనుగా (2) ||దేవునితో||

Daiva Svabhaava Mosagenugaa (2) ||Devunitho||

2. దైవ వెలుగును పొంది

2. Daiva Velugunu Pondi

దైవాత్మలో పాలు పొంది (2)

Daivaathmalo Paalu Pondi (2)

దివ్య వాక్యమును పొంది

Divya Vaakyamunu Pondi

దివిని రుచి చూచితిమి (2) ||దేవునితో||

Divini Ruchi Choochithimi (2) ||Devunitho||

3. ప్రభు పరిశుద్ధతలో

3. Prabhu Parishuddhathalo

పాలి వారమగునట్లు (2)

Paali Vaaramagunatlu (2)

సకల శ్రమల పాలై

Sakala Shramala Paalai

దైవ శిక్ష నొందితిమి (2) ||దేవునితో||

Daiva Shiksha Nondithimi (2) ||Devunitho||

4. పరలోక పిలుపునందు

4. Paraloka Pilupunandu

పాలివారిగాను జేసె (2)

Paalivaarigaanu Jese (2)

తన యింటి వారినిగా

Thana Yinti Vaarinigaa

జేయ మనల నేర్పరచె (2) ||దేవునితో||

Jeya Manala Nerparache (2) ||Devunitho||

5. తండ్రిని స్తుతించెదము

5. Thandrini Sthuthinchedamu

యోగ్యులుగా మముజేసె (2)

Yogyulugaa Mamujese (2)

పరిశుద్ధుల స్వాస్థ్యములో

Parishuddhula Svaasthyamulo

పాలివారిగా జేసె (2) ||దేవునితో||

Paalivaarigaa Jese (2) ||Devunitho||

6. క్రీస్తులో పాలివారై క్రీస్తు

6. Kreesthulo Paalivaarai Kreesthu

సుగుణములను పొంది (2)

Sugunamulanu Pondi (2)

దృఢముగా నిలిచెదము

Drudhamugaa Nilichedamu

పట్టు వదలక మనము (2) ||దేవునితో||

Pattu Vadalaka Manamu (2) ||Devunitho||

7. రాబోవు మహిమయందు

7. Raabovu Mahimayandu

పాలివారమౌ మనము (2)

Paalivaaramau Manamu (2)

ప్రభు సెలవిచ్చెనుగా

Prabhu Selavichchenugaa

ప్రియులను మేల్కొల్పెదము (2) ||దేవునితో||

Priyulanu Melkolpedamu (2) ||Devunitho||

Related Telugu Christian Songs