దేవుని పిలుపును వినుము

Devuni Pilupunu Vinumu

Telugu • vidhyaarthi-geethaavali

దేవుని పిలుపును వినుము - పరిశుద్ధపిలుపది చూడు

Devuni Pilupunu Vinumu - Parishuddhapilupadi Choodu

పరలోకసంబంధమైనట్టిది - ఉన్నతమైనట్టిది (2)

Paralokasambandhamainattidi - Unnathamainattidi (2)

నడుచుకొనుము - తగినట్లుగా - శ్రద్ధతో ఐక్యత కాపాడుకో

Naduchukonumu - Thaginatlugaa - Shraddhatho Aikyatha Kaapaaduko

నడుచుకొనుము - తగినట్లుగా - ప్రేమతో సహనపు వినయముతో

Naduchukonumu - Thaginatlugaa - Prematho Sahanapu Vinayamutho

1. ఆత్మీయబంధము కాపాడుకో - ఆత్మలో ప్రార్ధించు అనవరతం

1. Aathmeeyabandhamu Kaapaaduko - Aathmalo Praardhinchu Anavaratham

ఆత్మయందే ఆనందించుము - ఆత్మకు లోబడుము

Aathmayande Aanandinchumu - Aathmaku Lobadumu

ఆత్మానుసారివై నడువు (నడు)

Aathmaanusaarivai Naduvu (Nadu)

2. పరిశుద్దులగుటయె ప్రభు చిత్తము - పరిశుద్ధపరచెను ప్రభుక్రీస్తుడు

2. Parishuddulagutaye Prabhu Chiththamu - Parishuddhaparachenu Prabhukreesthudu

సమర్పించుము జీవితము - ప్రతిష్టించు ప్రభుకొరకే

Samarpinchumu Jeevithamu - Prathishtinchu Prabhukorake

ప్రభునిల సేవించుటకై (నడు)

Prabhunila Sevinchutakai (Nadu)

3. సువార్త సాక్ష్యము కాపాడుకో - సువార్త సత్యము ప్రకటించుము

3. Suvaartha Saakshyamu Kaapaaduko - Suvaartha Sathyamu Prakatinchumu

వాక్యముతో ధ్యానముతో - సంధించు యౌవ్వనులన్‌

Vaakyamutho Dhyaanamutho - Sandhinchu Yauvvanulan

సత్ప్రభు క్రీస్తుని కొరకై (నడు)

Sathprabhu Kreesthuni Korakai (Nadu)

4. పరిచర్య ధర్మము జరిగించుము - ప్రభుయేసు మహిమకై జీవించుము

4. Paricharya Dharmamu Jariginchumu - Prabhuyesu Mahimakai Jeevinchumu

ప్రభు పనిలో ప్రభవించుము - ప్రభువును సేవించుము

Prabhu Panilo Prabhavinchumu - Prabhuvunu Sevinchumu

ప్రభువును చూపించు అందరికి (నడు)

Prabhuvunu Choopinchu Andariki (Nadu)

Related Telugu Christian Songs