దేవుని నీతి ప్రతాపం

Devuni Neethi Prathaapam

Telugu by ఎ. బి. మాసిలామణి • andhra-kraisthava-keerthanalu

1. దేవుని నీతి ప్రతాపం

1. Devuni Neethi Prathaapam

భువి యేసుని సిల్వ ప్రభావం

Bhuvi Yesuni Silva Prabhaavam

దేవుల దేవుని అపురూపం

Devula Devuni Apuroopam

భువి యేసుని నామ స్వరూపం

Bhuvi Yesuni Naama Svaroopam

దేవ యెహోవ సువాక్యం - సౌభాగ్యం

Deva Yehova Suvaakyam - Saubhaagyam

దైవ జనుల హృదయానందం

Daiva Janula Hrudayaanandam

యేసుక్రీస్తు దైవ సుతుండు

Yesukreesthu Daiva Suthundu

యేసుక్రీస్తు మనుజసుతుండు

Yesukreesthu Manujasuthundu

యేసుక్రీస్తు దేవుండు

Yesukreesthu Devundu

యేసే ప్రభువు - స్తుతిపాత్రుడు

Yese Prabhuvu - Sthuthipaathrudu

2. ఆద్యంత రహిత కీర్తి

2. Aadyantha Rahitha Keerthi

అవతార శ్రమార్దన మూర్తి

Avathaara Shramaardana Moorthi

ఆకస రాసుల ఆదిపతి

Aakasa Raasula Aadipathi

అవనీ సృజనాత్మ ప్రతీతి

Avanee Srujanaathma Pratheethi

అఖిల ప్రపంచ ప్రదాత - అధినేత

Akhila Prapancha Pradaatha - Adhinetha

అనుదిన కృపాలిడు సుఖదాత

Anudina KrupaాLidu Sukhadaatha

3. పాపము భయపడు నామం

3. Paapamu Bhayapadu Naamam

పాపాత్ముడు కృపగను హోమం

Paapaathmudu Krupaganu Homam

పతితుల వెదకిన ప్రేమస్వరం

Pathithula Vedakina Premasvaram

పరలోక సుఖాల విహారం

Paraloka Sukhaala Vihaaram

పాప క్షమాపణ గానం - బహు

Paapa Kshamaapana Gaanam - Bahu

అనవరతము నిజబలిదానం

Anavarathamu Nijabalidaanam

4. జనముల జీవాధిపతి

4. Janamula Jeevaadhipathi

జగమంతటి నేలెడిజ్యోతి

Jagamanthati Neledijyothi

జీవుల అంతిమ న్యాయపతి

Jeevula Anthima Nyaayapathi

జీవాత్ములు క్రోలెడి నీతి

Jeevaathmulu Kroledi Neethi

జనన మరణ జయశీల - నరపాల

Janana Marana Jayasheela - Narapaala

జగతిని మార్చెడి శుభజ్వాల

Jagathini Maarchedi Shubhajvaala

Related Telugu Christian Songs