దేవుని కృప నిత్యముండును

Devuni Krupa Nithyamundunu

Telugu by సీయోను గీతాలు

దేవుని కృప నిత్యముండును

Devuni Krupa Nithyamundunu

ఆయన కృప నిత్యముండును

Aayana Krupa Nithyamundunu

స్తోత్రముచేసి స్తుతించి పాడి

Sthothramuchesi Sthuthinchi Paadi

హల్లెలూయా ఆర్భాటింతుము (2)

Hallelooyaa Aarbhaatinthumu (2)

1. ఇరుకునందు నశింపకుండ

1. Irukunandu Nashimpakunda

ఇంత వరకు కాచె మమ్ము (2)

Intha Varaku Kaache Mammu (2)

ఎంతో ఉత్తముడాయన ఉన్నతుడు

Entho Utthamudaayana Unnathudu

ఆయన కృప నిత్యముండను (2) ||దేవుని||

Aayana Krupa Nithyamundanu (2) ||Devuni||

2. శత్రు సేనలు చుట్టుముట్టిన

2. Shathru Senalu Chuttumuttina

దావీదు భక్తునిగాచిన దేవుడు (2)

Daaveedu Bhakthunigaachina Devudu (2)

ముందు నడచును ఆయన బలవంతుడు

Mundu Nadachunu Aayana Balavanthudu

ఆయన కృప నిత్యముండును (2) ||దేవుని||

Aayana Krupa Nithyamundunu (2) ||Devuni||

3. అగ్నిశోధన మనకు కలిగిన

3. Agnishodhana Manaku Kaligina

ఆదరించి విజయమిచ్చి (2)

Aadarinchi Vijayamichchi (2)

ఆర్భాటముతో మమ్ము నడిపించును

Aarbhaatamutho Mammu Nadipinchunu

ఆయన కృప నిత్యముండును (2) ||దేవుని||

Aayana Krupa Nithyamundunu (2) ||Devuni||

4. గాఢాంధాకార లోయలో నడచిన

4. Gaadhaandhaakaara LoyalO Nadachina

నా పాదములకు దీపమై యుండి (2)

Naa Paadamulaku Deepamai Yundi (2)

నన్ను నడుపును ఆయనే ఎల్లప్పుడు

Nannu Nadupunu Aayane Ellappudu

ఆయన కృప నిత్యముండును (2) ||దేవుని||

Aayana Krupa Nithyamundunu (2) ||Devuni||

5. నీచులెందరో అపహసించిన

5. Neechulendaro Apahasinchina

నెహెమ్యాకు తన ఆత్మనొసగె (2)

Nehemyaaku Thana Aathmanosage (2)

నిరతము మనకు ధైర్యము నిచ్చు

Nirathamu Manaku Dhairyamu Nichchu

ఆయన కృప నిత్యముండును (2) ||దేవుని||

Aayana Krupa Nithyamundunu (2) ||Devuni||

6. నిత్యదేవుడు సత్యవంతుడు

6. Nithya Devudu Sathyavanthudu

నిత్యము మనకు జయమునిచ్చి (2)

Nithyamu Manaku Jayamunichchi (2)

ఉత్సాహముగా మము నడిపించెను

Uthsaahamugaa Mamu Nadipinchenu

ఆయన కృప నిత్యముండును (2) ||దేవుని||

Aayana Krupa Nithyamundunu (2) ||Devuni||

Related Telugu Christian Songs