దేవాత్మజయో దీనదయాళూ పావనాత్మ

Devaathmajayo Deenadayaaloo Paavanaathma

Telugu by చెట్టి భానుమూర్తి • andhra-kraisthava-keerthanalu

దేవాత్మజయో దీనదయాళూ పావనాత్మ - మము బ్రోచితహో

Devaathmajayo Deenadayaaloo Paavanaathma - Mamu Brochithaho

నీవే గదా మా - నిజరక్షణకై జీవమీయ ధర - జేరితహో

Neeve Gadaa Maa - Nijarakshanakai Jeevameeya Dhara - Jerithaho

1. సుగుణాత్ములలో - సుగుణము నీవే నిగమము లెరుగని - నీతివహో

1. Sugunaathmulalo - Sugunamu Neeve Nigamamu Lerugani - Neethivaho

సుజనాత్ముల కిల - సుజ్ఞానాత్మవు - సవినయ భక్తికి సారమహో

Sujanaathmula Kila - SugnaanaాThmavu - Savinaya Bhakthiki Saaramaho

2. పేదలలో నిరు - పేదవు నీవే సాధులలో ఘన - సాధువహో

2. Pedalalo Niru - Pedavu Neeve Saadhulalo Ghana - Saadhuvaho

మోదమలర మా - భక్తిని గూర్చిన సాధు పేదజన సోదరహో

Modamalara Maa - Bhakthini Goorchina Saadhu Pedajana Sodaraho

3. దీనాత్ములలో - దీనుడవై భవదీయ దయారస - ధారలహో

3. Deenaathmulalo - Deenudavai Bhavadeeya Dayaarasa - Dhaaralaho

దినదిన మొసగిన - దేవాత్మజ యిమ్మానుయేలు వందనములహో

Dinadina Mosagina - Devaathmaja Yimmaanuyelu Vandanamulaho

4. పరమ పూజ్యుడా - పరిమిత ప్రేమాభరితుడ సంస్థవ - పాత్రుడహో

4. Parama Poojyudaa - Parimitha Premaabharithuda Sansthava - Paathrudaho

నిరతము నిన్నేమరక - నుతిం చెద నరజన గణముల - నేస్తడహో

Nirathamu Ninnemaraka - Nuthim Cheda Narajana Ganamula - Nesthadaho

Related Telugu Christian Songs