దేవా దివ్యానంత ప్రభావ

Devaa Divyaanantha Prabhaava

Telugu by పురుషోత్తము చౌదరి • andhra-kraisthava-keerthanalu

దేవా - దివ్యానంత ప్ర - భావ - కృపాంబోధీ భువన యే - హోవా =

Devaa - Divyaanantha Pra - Bhaava - Krupaambodhee Bhuvana Ye - Hovaa =

స్థావర జంగమ - సహిత నిఖిల జగ - దావన పావన - భావ నిరంతర ||దేవా||

Sthaavara Jangama - Sahitha Nikhila Jaga - Daavana Paavana - Bhaava Niranthara ||Devaa||

1. సార - కారుణ్యపారా - వారా - సర్వజ్ఞ నిర్ధీ - కారా - యేసు

1. Saara - Kaarunyapaaraa - Vaaraa - Sarvagna Nirdhee - Kaaraa - Yesu

నామావ - తారా - దీన జనోప - కారా = ఘోరమైన సం - సారటవిన

Naamaava - Thaaraa - Deena Janopa - Kaaraa = Ghoramaina San - Saaratavina

బడి - దారి గనని నను - జేరబిలిచితివి ||దేవా||

Badi - Daari Ganani Nanu - Jerabilichithivi ||Devaa||

2. అక్షీణ విభవానంద - మోక్ష - రాజ్య మహిమా - ధ్యక్ష - సంతత

2. Aksheena Vibhavaananda - Moksha - Raajya Mahimaa - Dhyaksha - Santhatha

సుజన రక్షా - కపట దుర్జన - శిక్షా = పక్ష విపక్ష వి - లక్షణ రహిత

Sujana Rakshaa - Kapata Durjana - Shikshaa = Paksha Vipaksha Vi - Lakshana Rahitha

క - టాక్షము నాదస - దీక్షను నిలుపవే ||దేవా||

Ka - Taakshamu Naadasa - Deekshanu Nilupave ||Devaa||

3. సుంద - రాశ్చర్య గుణ - బృందా - బంధుర నిత్యా - నందా - సాధు

3. Sunda - Raashcharya Guna - Brundaa - Bandhura Nithyaa - Nandaa - Saadhu

సజ్జన వంద్యా - ఖండిత కలుష బృందా = మంద మతిని నా -

Sajjana Vandyaa - Khanditha Kalusha Brundaa = Manda Mathini Naa -

డెందము కడున్ దెలి - వొంద జేసి నీ - యందు నిలుప గదే ||దేవా||

Dendamu Kadun Deli - Vonda Jesi Nee - Yandu Nilupa Gade ||Devaa||

4. నీవు - నన్ను సృజించి - నావు - నా గురురాజవు డవు - క్రీస్తు యేసుని

4. Neevu - Nannu Srujinchi - Naavu - Naa Gururaajavu Davu - Kreesthu Yesuni

- చావు - వలన నన్ను నిపి - నావు = పావన జనక సు - తాత్మలతోడను

- Chaavu - Valana Nannu Nipi - Naavu = Paavana Janaka Su - Thaathmalathodanu

కేవల మొక్కడ - వై వెలిగెడి ప్రభు ||దేవా||

Kevala Mokkada - Vai Veligedi Prabhu ||Devaa||

5. ప్రేమ స్వరూప నిత్య - క్షేమ - పతిత పావన - నామ - దాస లోకాబ్ధి -

5. Prema Svaroopa Nithya - Kshema - Pathitha Paavana - Naama - Daasa Lokaabdhi -

సోమ సర్వేశ పరమ - ధామ = నేమ మెరుగని - నీచుడ నధముడ -

Soma Sarvesha Parama - Dhaama = Nema Merugani - Neechuda Nadhamuda -

నో మహాత్మ దయ - తో మన్నింపవే ||దేవా||

No Mahaathma Daya - Tho Mannimpave ||Devaa||

Related Telugu Christian Songs